ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుచ్చి వద్ద మూడు కార్లు ఢీ

ABN, First Publish Date - 2022-10-27T08:51:58+05:30

తిరుచ్చి సమీపంలో మూడు కార్లు ఢీకొన్న ఘటనలో నలుగురు మహిళలు మృతిచెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- నలుగురు మహిళల దుర్మరణం

పెరంబూర్‌(చెన్నై), అక్టోబరు 26: తిరుచ్చి సమీపంలో మూడు కార్లు ఢీకొన్న ఘటనలో నలుగురు మహిళలు మృతిచెందారు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా... తిరుచ్చి-మదురై జాతీయ రహదారి తువరకుర్చి సమీపంలో మదురై నుంచి తిరుచ్చి వైపు వస్తున్న కారు టైరు హఠాత్తుగా పేలడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న రెండు కార్లను ఢీకొంది. ఈ ఘటనతో కారులో వున్న నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. అదే విధంగా కారులో చిక్కుకున్న ముగ్గురు చిన్నారులను బయటకు తీసి ప్రభుత్వాసుపత్రికి పంపించారు. ఇదిలా వుండగా మృతులను తిరుచ్చికి చెందిన మంగై అరసి (64), పూజ (20), పద్మ (20), రంజనగా గుర్తించిన పోలీసులు ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-10-27T08:52:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising