ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేదికపైనే అసువులు బాసిన రంగస్థల నటుడు

ABN, First Publish Date - 2022-07-19T15:57:40+05:30

వేదికపై నటిస్తూనే హఠాత్తుగా రంగస్థల నటుడు మృతిచెందడం విషాదం నింపింది. ఈరోడ్‌ జిల్లా ఉక్కరం పంచాయతీ కుప్పన్‌ తురై గ్రామంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై), జూలై 18: వేదికపై నటిస్తూనే హఠాత్తుగా రంగస్థల నటుడు మృతిచెందడం విషాదం నింపింది. ఈరోడ్‌ జిల్లా ఉక్కరం పంచాయతీ కుప్పన్‌ తురై గ్రామంలో ప్రతి ఏడాది వర్షాలు కురవాలని కోరుతూ ‘హిరణ్య’ అనే నాటకం ప్రదర్శిస్తుంటారు. అదే గ్రామానికి చెందిన రాజయ్యన్‌ (62) సహా 25 మంది కళాకారులు పాల్గొంటుండగా, నాటకంలో నరసింహన్‌, నారద అనే రెండు పాత్రలను రాజయ్యన్‌ పోషిస్తాడు. ఆయన పాటలు, నటన గ్రామస్థుల మెప్పు పొందేది. ఐదు రోజులు వేసే ఈ నాటకం చివరరోజైన ఆదివారం రాత్రి ప్రారంభమైంది. వేకువజామున 3 గంటల ప్రాంతంలో రాజయ్యన్‌ పద్యాలు పాడుతూ నటించే సమయంలో ఒక ప్రాంతంలో నిలబడిపోయి, కొద్ది క్షణాల్లోనే వేదికపై కుప్పకూలి పడిపోయాడు. సహచర కళాకారులు, గ్రామస్తులు అతడిని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. రాజయ్యన్‌ మృతదేహానికి గ్రామస్థులు కన్నీటిపర్యంతమవుతూ నివాళులర్పించారు.

Updated Date - 2022-07-19T15:57:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising