ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Girl Delivers Baby: తండ్రి చేతిలోనే అత్యాచారానికి గురై.. బిడ్డకు జన్మనిచ్చిన 8వ తరగతి బాలిక

ABN, First Publish Date - 2022-08-06T02:40:12+05:30

కన్న తండ్రి చేతిలోనే అత్యాచారానికి గురైన 13 ఏళ్ల బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. తమిళనాడులోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెల్లోర్: కన్న తండ్రి చేతిలోనే అత్యాచారానికి గురైన 13 ఏళ్ల బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. తమిళనాడులోని వెల్లోర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితుడైన 44 ఏళ్ల బాలిక తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువున్న బాలిక కడుపు నొప్పితో బాధపడుతుండడంతో బంధువులు ఆమెను ప్రభుత్వ వెల్లోర్ మెడికల్ కాలేజీలో చూపించారు. బాలికను పరీక్షించిన వైద్యుడు ఆమె గర్భవతి అని చెప్పడంతో కుటుంబ సభ్యులు షాకయ్యారు. 


బాలిక ఈ నెల 2న బిడ్డకు జన్మనిచ్చింది. వైద్య బృందం వెంటనే ఈ ఘటనపై శిశు సంక్షేమ కమిటీకి సమాచారం అందించింది. వెంటనే వారు వెల్లోర్ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను ప్రశ్నించిన పోలీసులు ఆమె చెప్పింది విని విస్తుపోయారు. తండ్రి తనపై గత 10 నెలలుగా అఘాయిత్యానికి పాల్పడుతున్నట్టు బాలిక పోలీసులకు వివరించింది. తల్లిదండ్రులు విడిపోవడంతో బాధిత బాలిక, ఆమె సోదరుడు తాతయ్య ఇంట్లో ఉంటున్నారు. బాలిక రోజూ తండ్రికి భోజనం ఇస్తూ ఉండేది.  


కుమార్తె భోజనం పట్టుకొచ్చిన ప్రతిసారి తండ్రి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. అంతేకాదు, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్టు బాలిక పోలీసులకు తెలిపింది. బాలిక వాంగ్మూలంతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతడిని పోలీస్ కస్టడీకి అప్పగించింది. పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-08-06T02:40:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising