ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Raging: కేంద్రీయ విద్యాలయంలో ర్యాగింగ్‌

ABN, First Publish Date - 2022-11-25T10:21:47+05:30

స్థానిక కేకే నగరులోని కేంద్రీయ విద్యాలయ స్కూల్‌లో పదో తరగతి చదివే విద్యార్థిని సహ విద్యార్థులు ర్యాగింగ్‌ చేశారు. అతడి మర్మాంగాన్ని నలిపి వేయంతో బాధిత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- విచారణ జరుపుతున్న వడపళని ఏసీ

అడయార్‌(చెన్నై), నవంబరు 24: స్థానిక కేకే నగరులోని కేంద్రీయ విద్యాలయ స్కూల్‌లో పదో తరగతి చదివే విద్యార్థిని సహ విద్యార్థులు ర్యాగింగ్‌ చేశారు. అతడి మర్మాంగాన్ని నలిపి వేయంతో బాధిత విద్యార్థి తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. దీంతో ఆ విద్యార్థిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై వడపళని అసిస్టెంట్‌ కమిషనర్‌ విచారణ జరుపుతున్నారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే, ఎంజీఆర్‌ నగర్‌కు చెందిన పౌల్‌రాజ్‌ అనే వ్యక్తి కేకే నగరు పోలీస్‌ స్టేషన్‌లో ఒక ఫిర్యాదు చేశాడు. అందులో కేకే నగర్‏లోని కేంద్రీయ విద్యాలయం పాఠశాలలో పదో తరగతి చదువుతున్న తన కుమారుడిని సహ విద్యార్థులు ర్యాగింగ్‌ చేసిన తీరును వివరించాడు. ర్యాగింగ్‌ చేసిన విషయాన్ని మొదట ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్ళగా సంబంధిత విద్యార్థులను హెచ్చరించాని, అయినప్పటికీ ఈ నెల 21వ తేదీ మరోమారు వేధించారన్నారు. ర్యాగింగ్‌ చేసి మర్మాంగం నలిపివేయడంతో తీవ్ర అస్వస్థతకు గురైన తన కుమారుడిని కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నామని, ఈ ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులపై చర్య తీసుకోవాలని కోరారు. ఈ విషయం పోలీస్‌ కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ దృష్టికి వెళ్ళడంతో ఆయన కూడా విచారణకు ఆదేశించారు. దీంతో వడపళని అసిస్టెంట్‌ కమిషర్‌ బాలమురుగన్‌ గురువారం ఉదయం పాఠశాలకు వెళ్ళి విచారణ జరిపారు.

Updated Date - 2022-11-25T10:21:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising