ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hindu Wife Burqa: హిందూ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. బురఖా ధరించలేదని ఆ ప్రేమనంతటినీ..

ABN, First Publish Date - 2022-09-28T00:49:53+05:30

అతడు ముస్లిం అబ్బాయి. హిందూ అమ్మాయిని ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మరి అంత ప్రేమ ఏమైపోయిందో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: అతడు ముస్లిం అబ్బాయి. హిందూ అమ్మాయిని ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మరి అంత ప్రేమ ఏమైపోయిందో.. బురఖా ధరించలేదని, ఇస్లామిక్ సంప్రదాయాలు పాటించలేదని ఆమెను గొంతుకోసి కడతేర్చాడు. ముంబైలోని తిలక్‌నగర్ ప్రాంతంలో జరిగిందీ ఘటన. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో కటకటాలు లెక్కించుకుంటున్నాడు. భర్త చేతిలో దారుణంగా హత్యకు గురైన ఆమె పేరు రూపాలి. నిందితుడు ఇక్బాల్ షేక్‌ను ఆమె మూడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. 


వివాహమైన దగ్గిరి నుంచి ఇక్బాబ్ కుటుంబం నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. బురఖా ధరించాలని, ఇస్లామిక్ సంప్రదాయాలను పాటించాలని ఆమెపై ఒత్తిడి తెచ్చేవారు. అయితే, వాటిని ఆమె పాటించేది కాదు. దీంతో 22 ఏళ్ల రూపాలి వేరుగా ఉండాలని నిర్ణయించుకుంది. సోమవారం రూపాలి తన భర్త ఇక్బాల్ షేక్‌ను కలిసింది. విడాకులు తీసుకుందామని కోరింది. అయితే, వారికి ఇప్పటికే ఓ బాబు ఉండడంతో విడాకులకు అతడు నిరాకరించాడు. అంతేకాదు, కుమారుడిని తనకు అప్పగించాలని డిమాండ్ చేశాడు. దీనికామె నిరాకరించింది. దీంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన ఇక్బాల్ కత్తితో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. 


రాత్రి 10 గంటల సమయంలో నిందితుడిని ఇక్బాల్ మహ్మద్ షేక్‌గా గుర్తించామని పోలీసులు తెలిపారు. బాధితురాలిని ఇస్లామిక్ సంప్రదాయాలను పాటించాలని, బురఖా ధరించాలని నిందితుడి కుటుంబం ఒత్తిడి తెచ్చిందని పేర్కొన్నారు. అందుకామె నిరాకరించడంతో గొడవలు మొదలైనట్టు చెప్పారు. రూపాలి కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయాన్ని పోలీసులకు తెలిపారు. పెళ్లయిన తొలి రోజు నుంచే బురఖా ధరించాలని వారు బలవంతం చేయడం మొదలుపెట్టారని చెప్పారు. వారి బాధలు భరించలేని కుమార్తె గత కొన్ని నెలలుగా వేరుగా ఉంటోందని చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-09-28T00:49:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising