ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Love marriage: కుమార్తె కూలీని ప్రేమించి పెళ్లి చేసుకుందని...తండ్రి దారుణం

ABN, First Publish Date - 2022-07-26T17:53:03+05:30

తమిళనాడు రాష్ట్రంలో పరువు హత్య ఘటన సంచలనం రేపింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 టుటికోరిన్ (తమిళనాడు): తమిళనాడు రాష్ట్రంలో పరువు హత్య ఘటన సంచలనం రేపింది. తన కుమార్తె ఓ దినసరి కూలీని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కోపంతో సాక్షాత్తూ తండ్రి తన కూతురు, అల్లుడిని కొడవలితో నరికి చంపిన దారుణ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని టుటికోరిన్‌లో జరిగింది. కోవిల్‌పట్టి నగరానికి సమీపంలోని వీరపట్టి గ్రామానికి చెందిన వ్యక్తి ముత్తుకుట్టి (50) కుమార్తె రేష్మ(20) కోవిల్‌పట్టిలోని ఓ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతుండేది. ఆ ప్రాంతానికి చెందిన దినసరి కూలీ మాణికరాజ్ (26)తో బాలిక ప్రేమలో పడింది. తండ్రి ముత్తుకుట్టి వారి ప్రేమను అంగీకరించనప్పటికీ, ప్రేయసీ ప్రియులు రేష్మ, మాణికరాజ్‌లు ఇటీవలే వివాహం చేసుకున్నారు.అతని ప్రేమ పెళ్లిపై రేష్మ తండ్రి ముత్తుకుట్టి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. 


వీరిద్దరూ కొద్ది రోజుల క్రితం వివాహం చేసుకుని రెండు రోజుల క్రితమే గ్రామానికి తిరిగి వచ్చినట్లు సమాచారం.అనంతరం గ్రామ పంచాయతీ ద్వారా వారిద్దరినీ గ్రామంలో ఉండేందుకు అనుమతించారు. కానీ ముత్తుకుట్టి తన కూతురిపై కోపంతో ఉన్నాడు.సోమవారం సాయంత్రం ఇంట్లో రేష్మ, ఆమె భర్త మాణికరాజ్ ఒంటరిగా ఉన్న సమయంలో ముత్తుకుట్టి అక్కడికి వెళ్లి ఇద్దరినీ కొడవలితో నరికి చంపాడు. అనంతరం సంఘటన స్థలం నుంచి పరారయ్యాడు.ఈ దారుణ హత్య ఘటనపై సమాచారం మేరకు ఎట్టయ్యపురం పోలీస్‌స్టేషన్‌ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.పోలీసులు హంతకుడు ముత్తుకుట్టిని పట్టుకున్నారు. ఈ పరువు హత్య కేసుపై విచారణ జరుపుతున్నామని తమిళనాడు పోలీసులు చెప్పారు. 


Updated Date - 2022-07-26T17:53:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising