ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ ప్రేయసిపై యాసిడ్ దాడి.. అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులపై కాల్పులు

ABN, First Publish Date - 2022-07-16T20:23:03+05:30

ఈ విషయమై సెంట్రల్ నోయిడా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హరిష్ చందర్ మాట్లాడుతూ ‘‘యాసిడ్ దాడి విషయం తెలుసుకున్న అనంతరం నిందితుడి కోసం పోలీసు బృందం గాలింపు చేపట్టింది. శుక్రవారం ఉదయం సెక్టార్ 69 ప్రాంతంలో కనిపించినట్లు తెలిసి అతడిని పట్టుకోవడానికి పోలీసు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మాజీ ప్రేయసిపై యాసిడ్ దాడి చేయడమే కాకుండా పోలీసులపై కాల్పులు జరిపిన ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. యాసిడ్ దాడిలో గాయపడ్డ మహిళ ప్రస్తుతం ఆసుపత్రితో చికిత్స పొందుతుండగా, నిందితుడు జరిపిన కాల్పుల్లో పోలీసులెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే పోలీసులు జరిపిన ప్రతి కాల్పుల్లో నిందితుడి కాలికి గాయమైంది. నిందితుడి పేరు వికాస్, నోయిడాకు చెందిన ఇతడు నోయిడాలోని మమురా ప్రాంతంలో తన మాజీ ప్రేయసిపై బ్యాటరీ వాటర్‌తో గురువారం రాత్రి దాడికి దిగాడు. గాయాలపాలైన మహిళను తొలుత స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అయితే మరింత ఉత్తమ చికిత్స నిమిత్తం ఢిల్లీలోని సఫ్దార్‌గంజ్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.


ఈ విషయమై సెంట్రల్ నోయిడా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హరిష్ చందర్ మాట్లాడుతూ ‘‘యాసిడ్ దాడి విషయం తెలుసుకున్న అనంతరం నిందితుడి కోసం పోలీసు బృందం గాలింపు చేపట్టింది. శుక్రవారం ఉదయం సెక్టార్ 69 ప్రాంతంలో కనిపించినట్లు తెలిసి అతడిని పట్టుకోవడానికి పోలీసు బృందం వెళ్లింది. అయితే పోలీసు బృందాన్ని చూసిన నిందితుడు వారిపై కాల్పులు జరిపాడు. అనంతరం పోలీసులు ప్రతి కాల్పులు జరపడంతో ఒక బుల్లెట్ నిందితుడి కాలులో దిగింది. అనంతరం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లింది. యాసిడ్ దాడి జరిగిన 16 గంటలకు నిందితుడు అదుపులోకి వచ్చాడు’’ అని తెలిపారు.


యాసిడ్ దాడికి గల కారణాన్ని నిందితుడు పోలీసులకు వివరిస్తూ.. తాను బాధిత మహిళను వివాహం చేసుకున్నాడని, వారు మూడు సంవత్సరాలు ముంబైలో కలిసి ఉన్నారని, అయితే ఆమె ఇప్పుడు మరొక వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకుందని చెప్పాడు. ఈ సంబంధం వల్ల విసుగు చెంది మహిళపై దాడి చేయడానికి ముందుగా ప్లాన్ చేసి, ఆ ప్లాన్ ప్రకారమే యాసిడ్ దాడి చేసినట్లు తెలిపాడు. నిందితుడు బాధిత మహిళను వివాహం చేసుకున్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. అలాగే అతడికి గతంలో నేర చరిత్ర కూడా ఉన్నట్లు గుర్తించినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

Updated Date - 2022-07-16T20:23:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising