ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాటేసిన రా‘బంధువు’లు

ABN, First Publish Date - 2022-01-12T16:22:36+05:30

విల్లుపురం సమీపంలో ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమెను గర్భవతిని చేసిన బంధువులు ఎనిమిదిమందిని పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. విల్లుపురం ఈచ్చాంకుప్పానికి చెందిన బాలిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- బాలికపై బంధువుల సామూహిక అత్యాచారం

- పోక్సో చట్టం కింద 8 మంది అరెస్టు


చెన్నై: విల్లుపురం సమీపంలో ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమెను గర్భవతిని చేసిన బంధువులు ఎనిమిదిమందిని పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. విల్లుపురం ఈచ్చాంకుప్పానికి చెందిన బాలిక చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. దీంతో పుదుచ్చేరిలోని శిశు సంరక్షణ కేంద్రంలో ఉంటూ ఆమె ప్రాథమిక విద్యను పూర్తి చేసింది. కొద్ది నెలలకు ముందు ఆ బాలిక ఈచ్చాంకుప్పంలోని పెద్దమ్మ ఇంటికి వచ్చింది. కాగా రెండు రోజుల క్రితం బాలిక తీవ్ర అస్వస్థతకు గురికావటంతో ఆమెను ముండియంబాక్కం ఆస్పత్రికి తీసుకెళ్ళారు. బాలికకు వైద్యులు స్కానింగ్‌ చేయగా  నాలుగు నెలల గర్భిణి అని తెలుసుకుని దిగ్ర్భాంతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బాలిక పెద్దమ్మ మహిళా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ జరిపినప్పుడు బాలిక బంధువులైన వెంకటేశన్‌ (81), ఇళయ రాజా (28), మోహన్‌ ఆమెపై తరచూ అత్యా చారానికి పాల్పడినట్లు వెల్లడైంది. వీరిలో మోహన్‌ ఆ బాలికకు అన్న వరుస అవుతాడని పోలీసులు తెలిపారు. వీరితోపాటు వెంకటేశన్‌ (25), ప్రభు (37), బాబు (22), సత్యరాజ్‌ (28)తో కలిసి వీరందరూ బాలికపై అత్యాచారం జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఏడుగురిని పోక్సోచట్టం కింద అరెస్టు చేశారు. ఈ అత్యాచారం కేసుతో సంబంధం ఉన్న ఏళుమలై నెల్లూరులో ఉండగా పోలీసులు అరెస్టు చేసి తీసుకువచ్చారు.

Updated Date - 2022-01-12T16:22:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising