ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rejects Marriage Proposal: చంపి...ముక్కలు చేస్తా...బాలికను బెదిరించిన యువకుడు

ABN, First Publish Date - 2022-11-28T10:31:14+05:30

తనతో పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఓ బాలికను చంపి, ముక్కలు చేస్తానని బెదిరించిన యువకుడి బాగోతం...

Kanpur man Mohammad Faiz
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాన్పూర్ (ఉత్తరప్రదేశ్): శ్రద్ధావాకర్ హత్య ఉదంతం మరవక ముందే యూపీలోని కాన్పూర్ నగరంలో మరో బెదిరింపు ఘటన చోటుచేసుకుంది. తనతో పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఓ బాలికను చంపి, ముక్కలు చేస్తానని బెదిరించిన యువకుడి బాగోతం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ నగరంలో తాజాగా వెలుగుచూసింది. మహ్మద్ ఫైజ్ అనే యువకుడు మైనర్‌ బాలికను పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నాడని, అయితే బాలిక అతని ప్రతిపాదనను తిరస్కరించింది. దీంతో కోపంతో ‘‘నన్ను పెళ్లి చేసుకోకుంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తా’’ అంటూ మహ్మద్ ఫైజ్ బాలికను బెదిరించాడు.

ఫైజ్ పాఠశాలకు వెళ్లే బాలికను వెంబడిస్తూ, పదేపదే వేధించేవాడని బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.బాలికకు ప్రాణహాని ఉందని ఫైజ్‌పై ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు ఆధారంగా చమన్ గంజ్‌లోని ఫైజ్ నివాసంలో నౌబస్తా పోలీసులు దాడులు జరిపారు. ఫైజ్ కుటుంబం పోలీసులతో వాగ్వాదానికి దిగింది.అక్టోబర్ 16వతేదీన మహ్మద్ ఫైజ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఏసీపీ అభిషేక్ కుమార్ పాండే చెప్పారు.పోలీసులు ఫైజ్ ని అరెస్టు చేసి జైలుకు పంపారు.

Updated Date - 2022-11-28T10:31:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising