ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jewelry robbery: కళ్లకుర్చిలో భారీ చోరీ !

ABN, First Publish Date - 2022-08-09T16:18:14+05:30

కళ్లకుర్చి జిల్లా పుదూరులోని ఓ నగల దుకాణంలో 281 సవర్ల బంగారు నగలు, 30 కిలోల వెండి వస్తువులు, నగదు చోరికి గురైంది. లోకనాధన్‌(Lokanadhan)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                             - దుకాణంలో 281 సవర్ల నగల దోపిడీ


చెన్నై, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): కళ్లకుర్చి జిల్లా పుదూరులోని ఓ నగల దుకాణంలో 281 సవర్ల బంగారు నగలు, 30 కిలోల వెండి వస్తువులు, నగదు చోరికి గురైంది. లోకనాధన్‌(Lokanadhan) ఏర్పాటుచేసిన శ్రీస్వర్ణమహల్‌ నగల దుకాణంలో సోమవారం వేకువజామున జరిగిన దోపిడీని ఛేదించేందుకు ప్రత్యేక పోలీసు బృం దాలు ఏర్పాటయ్యాయి. లోకనాథన్‌ ప్రతిరోజూ రాత్రి పది గంటలకు దుకాణం ముందున్న ఇనుపగేట్లకు తాళం వేసి ఇంటికి వెళ్తుంటారు. ఆదివారం రాత్రి యధావిధిగా దుకాణానికి తాళాలు వేసి ఇంటికి వెళ్ళారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఆ దుకాణం  ఇనుప గ్రిల్స్‌కు ఉన్న కమ్మీలు తెగి ఉండటం, ప్రధాన ద్వారం తలుపులు తెరచి ఉండటం చూసిన స్థానికులు లోకనాథన్‌కు సమాచారమిచ్చారు. లోక్‌నాధన్‌(Lokanadhan) హుటాహుటిన అక్కడికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కళ్ళకుర్చి ఎస్పీ పగల్వన్‌ సిబ్బందితో అక్కడికి చేరుకుని ఫోరెన్సిక్‌ నిపుణులను రప్పించి దొంగల వేలిముద్రలను సేకరించారు. పోలీసు జాగిలాన్ని కూడా తెప్చించారు. ఆ జాగిలం దుకాణం నుంచి అక్కడికి సమీపంలోని  పొలాల వరకు వెళ్ళి ఆగిపోయింది. పోలీసులు అక్కడ గాలించగా నగలను భద్రపరిచే పెట్టె పడి వుంది. దోపిడీదారులు ఆ పెట్టెలోని నగలను అపహరించి దానిని పొలంలో పారవేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దోపిడీ దొంగల ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Updated Date - 2022-08-09T16:18:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising