ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్థరాత్రి దారుణం...

ABN, First Publish Date - 2022-04-26T15:17:15+05:30

పుదుకోట జిల్లా అరంతాంగి సమీపం ఆవుడయార్‌పట్టిలో నివసిస్తున్న పారిశ్రామికవేత్తను ఆదివారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి ఇంటిలోని 175 సవర్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- పారిశ్రామికవేత్త దారుణ హత్య 

- 175 సవర్ల నగల దోపిడీ


చెన్నై: పుదుకోట జిల్లా అరంతాంగి సమీపం ఆవుడయార్‌పట్టిలో నివసిస్తున్న పారిశ్రామికవేత్తను ఆదివారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి ఇంటిలోని 175 సవర్ల బంగారు నగలు, నగదు దోచుకెళ్ళారు. వివరాలిలా.. అవుడయార్‌పట్టిలో మహమ్మద్‌ నిజామ్‌ (52), అయిషా బీవీ (48) అనే దంపతులు నివసిస్తున్నారు. మహమ్మద్‌ నిజామ్‌ ఆప్టికల్స్‌ దుకాణం నడుపుతున్నారు. వీరికి ఇద్దరుకుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కాగా, కుమారులు ఇరువురు వేర్వేరు చోట్ల కంటి అద్దాల దుకాణాలను నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి మహమ్మద్‌జాన్‌ రంజాన్‌ ఉపవాసం సందర్భంగా ఇంటి ఎదురుగా ఉన్న మసీదులో ప్రార్థనకు వెళ్ళి తిరిగి వచ్చారు. ఇంటి ముందు కుర్చీలో కూర్చుని ఉన్న అతడిపై గుర్తు తెలియన వ్యక్తులు వేటకొడవళ్లతో దాడిచేసి హత్య చేశారు. ఆ తర్వాత ఇంటిలో చొరబడి అయిషా బీవీని తాళ్లతో బందించారు. బీరువాలోని 175 సవర్ల నగలు నగదు దోచుకుని పారిపోయారు. అయిషా బీవీ అతి కష్టం మీద సెల్‌ఫోన్‌ అందుకుని తన బంధవులకు ఫోన్‌ చేసింది. వెంటనే బంధవులు, చుట్టుపక్కల నివసిస్తున్నవారంతా అక్కడకు చేరుకున్నారు. ఇంటి గడపవద్దే రక్తపుమడుగులో పడి ఉన్న మహమ్మద్‌ జాన్‌ మృతదేహాన్ని చూసి దిగ్ర్భాంతి చెందారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మహమ్మద్‌జాన్‌ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఎస్పీ నిషా పార్తీబన్‌ ఇతర పోలీసు ఉన్నతాధికారులు హత్య, దోపిడీ జరిగిన ప్రాంతాలను పరిశీలించారు.

Updated Date - 2022-04-26T15:17:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising