ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Harassed by father: జైలు నుంచి బయటకొచ్చిన తండ్రి.. కుమార్తె ఆత్మహత్య!

ABN, First Publish Date - 2022-09-20T23:45:47+05:30

జంట హత్యల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న తండ్రి పెరోల్‌పై బయటకు వచ్చి చిత్రహింసలకు గురిచేస్తుండడంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బండా: జంట హత్యల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న తండ్రి పెరోల్‌పై బయటకు వచ్చి చిత్రహింసలకు గురిచేస్తుండడంతో ఆయన ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్యకు యత్నించారు. వీరిలో అక్క మృతి చెందగా, చెల్లెలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh)లోని బాండా (Banda) జిల్లా బబేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్హిరీ గ్రామంలో జరిగిందీ ఘటన. అదనపు సూపరింటెండెంట్ లక్ష్మీనివాస్ మిశ్రా కథనం ప్రకారం.. రేఖాదేవి-మల్ఖాన్ సింగ్ దంపతులకు ప్రియాంక (21), స్వప్న (19) సంతానం. 


16 ఏళ్ల క్రితం జరిగిన జంట హత్యల కేసులో మల్ఖాన్ సింగ్‌కు జీవిత ఖైదు పడింది. ఆరు నెలల క్రితం పెరోల్‌పై బయటకు వచ్చిన మల్ఖాన్ సింగ్, సోదరులు సురేష్, రాజేష్‌లతో కలిసి భార్యా పిల్లలను చితకబాదేవాడు. వారు ఇంట్లో వంట చేయకుండా నాటుతుపాకితో బెదిరించేవారు. తండ్రి పెడుతున్న చిత్రహింసలను భరించలేని కుమార్తెలు ప్రియాంక, స్వప్న విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే వారిని బాండా మెడికల్ కాలేజీ (Banda Medical College)కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రియాంక మృతి చెందగా, స్వప్న చావుబతుకుల మధ్య పోరాడుతోంది. బాధిత యువతుల తల్లి రేఖాదేవి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మల్ఖాన్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్పీ తెలిపారు.  

Updated Date - 2022-09-20T23:45:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising