ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gold: 32 కిలోల నగలను బంగారు కడ్డీలుగా మార్చే యత్నం

ABN, First Publish Date - 2022-08-21T16:02:35+05:30

స్థానిక ఆరుంబాక్కంలోని ప్రైవేటు బ్యాంక్‌లో చోరీ చేసిన 32 కిలోల నగలను బంగారు కడ్డీలుగా మార్చేందుకు యత్నించినట్లు పోలీసుల విచారణలో తేలింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                  - విచారణలో నిందితుల వెల్లడి


పెరంబూర్‌(చెన్నై), ఆగస్టు 20: స్థానిక ఆరుంబాక్కంలోని ప్రైవేటు బ్యాంక్‌లో చోరీ చేసిన 32 కిలోల నగలను బంగారు కడ్డీలుగా మార్చేందుకు యత్నించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ బ్యాంక్‌ దోపిడీ కేసులో మురుగన్‌, సూర్య, సంతోష్‌, సెంథిల్‌కుమార్‌, బాలాజి తదితర ఐదుగురిని అరెస్ట్‌ చేసి పోలీసులు, అచ్చరపాక్కం పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌(Police Inspector) అమల్‌రాజ్‌ను కూడా అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరచి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ మొత్తం ఘటనలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. చోరీ చేసిన 32 కిలోల నగల్ని బంగారు కడ్డీలుగా మార్చాలని నిర్ణయించిన నిందితులు.. కోయంత్తూర్‌కు చెందిన నగల దుకాణ యజమాని శ్రీవాత్సవ్‌ను సంప్రదించారు. ఆయన్ని చెన్నైకి రప్పించి నగలు మొత్తం ఒకేసారి బంగారు కడ్డీలుగా మార్చేలా వ్యూహరచన చేశారు. ఇందుకోసం స్థానిక క్రోంపేటలోని ఓ లాడ్జిలో గది తీసుకొని బసచేశారు. శ్రీవాత్సవ్‌, అతడి సహాయకుడు శ్రీరామ్‌(Sriram) నగలు తయారుచేసే మెషిన్‌ కొనుగోలు చేసి బంగారు కడ్డీలుగా మార్చాలని నిర్ణయించారు. తొలుత 300 గ్రాముల నగలు కరిగిస్తున్న సమయంలో దట్టమైన పొగ రావడంతో ఆందోళన చెందిన నిందితులు, ఇలా చేస్తే పట్టుబడిపోతామన్న భయంతో ఆ ప్రయత్నాన్ని తాత్కాలికంగా విరమించారు. అదే సమయంలో 32 కిలోల నగలను చిన్న చిన్నవిగా చేసి బయటకు తీసుకెళ్లి సులభంగా విక్రయించవచ్చని వారు భావించారు. నగల విక్రయానికి పూర్తిగా సహకరిస్తానని నగల దుకాణ యజమాని శ్రీవాత్సవ తెలుపడంతో, పని అయిన వెంటనే భారీగా నగదు ముట్టచెప్పేందుకు నిందితులు అంగీకరించారు. ఆ సమయంలో పోలీసులు నగలు స్వాధీనం చేసుకున్నారు.

    నగల దుకాణ యజమాని శ్రీవాత్సవను కూడా అరెస్ట్‌ చేసి జైలుకు తరలించి, పరారీలో ఉన్న శ్రీవాత్సవ(Srivatsava) సహాయకుడు శ్రీరామ్‌ కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో అరెస్టయిన ఇన్‌స్పెక్టర్‌ భార్యతో పాటు, నగలు స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో కూడా మరి కొందరిని అరెస్ట్‌ చేసే అవకాశమున్నట్లు పోలీసుల సమాచారం.

Updated Date - 2022-08-21T16:02:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising