ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Fraud: ఆన్‌లైన్‌ రుణాల పేరిట మోసం

ABN, First Publish Date - 2022-11-11T10:12:20+05:30

రుణాలిప్పిస్తామని నగదు వసూలు చేసే వ్యవహారంలో ఇద్దరు యువతులు సహా నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్థానిక చేపాక్కం అరుణాచలం(Arunachalam)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఇద్దరు యువతులు సహా నలుగురి అరెస్టు

పెరంబూర్‌(చెన్నై), నవంబరు 10: రుణాలిప్పిస్తామని నగదు వసూలు చేసే వ్యవహారంలో ఇద్దరు యువతులు సహా నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్థానిక చేపాక్కం అరుణాచలం(Arunachalam) వీధికి చెందిన లక్ష్మికి కొన్ని రోజుల కిత్రం ఫోన్‌ చేసిన వ్యక్తి, ఎలాంటి పత్రాలు లేకుండా రూ.5 లక్షల రుణం ఇస్తామని చెప్పాడు. ఆ మాటలు నమ్మిన ఆమె రుణం తీసుకునేందుకు అంగీకరించింది. రుణం కోసం ఇన్సూరెన్స్‌గా రూ.31,500 చెల్లించాలని ఆ వ్యక్తి కోరడంతో, లక్ష్మి గూగుల్‌ పే ద్వారా నగదు పంపించింది. అనంతరం ఆ వ్యక్తి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో అనుమానించిన లక్ష్మి ట్రిప్లికేన్‌ పోలీస్‏స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన పోలీసులు, ఎన్నూర్‌ ప్రాంతానికి చెందిన వినిత, అయనావరంకు చెందిన థెరిస్సా, పల్లవన్‌తాంగళ్‌కు చెందిన పాల్‌జోసఫ్‌, కేకే నగర్‌కు చెందిన అరవింద్‌లను అదుపులోకి తీసుకొని విచారించారు. ప్రైవేటు కాల్‌ సెంటర్‌లో పనిచేస్తున్న వీరు పలువురికి ఫోన్‌ చేసి రుణాలు అందిస్తామని చెప్పి మోసాలకు పాల్పడుతున్నట్లు తేలడంతో, నలుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచి జైలుకు తరలించారు. రుణాలు ఇప్పిస్తామంటూ వస్తున్న ఫోన్‌ కాల్స్‌తో అప్రమత్తంగా ఉండాలని, అనుమానించిన వెంటనే తమకు తెలియజేయాలని నగర పోలీసు శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

Updated Date - 2022-11-11T10:14:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising