ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాణసంచా కర్మాగారంలో పేలుడు

ABN, First Publish Date - 2022-01-02T14:56:59+05:30

కొత్త ఏడాది తొలిరోజు విరుదునగర్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శివకాశి సమీపంలోని ఓ ప్రైవేటు బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించి ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఐదుగురి దుర్మరణం

- ఏడుగురికి తీవ్ర గాయాలు

- శివకాశి సమీపంలో దుర్ఘటన


చెన్నై: కొత్త ఏడాది తొలిరోజు విరుదునగర్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శివకాశి సమీపంలోని ఓ ప్రైవేటు బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించి ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలిలా... మేట్టుపట్టికి చెందిన వళివిడు మురుగన్‌ అనే వ్యక్తి నిర్వహిస్తున్న బాణసంచా కర్మాగారంలో రోజూ సుమారు వందమంది కార్మికులు పని చేస్తుంటారు. ఈ కర్మాగారంలో మొత్తం 23 గదులు, బాణసంచా తయారీకి ఉపయోగించే మందుగుండు నిల్వలను భద్రపరిచే విశాలమైన భవనం ప్రత్యేకంగా వున్నాయి. శనివారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఆ భవనంలో కార్మికులు మందుగుండు కలు పుతుండగా, రాపిడికి హఠాత్తుగా మంటలు చెలరేగి పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. ఆ ధాటికి ఆ భవనం నేలమట్టమైంది. ఆ సమయంలో అక్కడ పని చేస్తున్న కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. పేలుడు సంభవించిన వెంటనే ఆ భవనం పక్కనే ఉన్న గదులలో పనిచేస్తున్న కార్మికులంతా ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదం గురించి తెలియగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన అక్కడికి చేరుకున్నారు. శివకాశి, శ్రీవిల్లిపుత్తూరు, విరుదునగర్‌, వత్తిరిరుప్పు ప్రాంతాల నుంచి నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక దళం గంటకు పైగా శ్రమంచి మంటలను అదుపుచేశారు. ఆ తర్వాత ఎక్సకవేటర్లతో భవన శిథిలాలను తొలగించగా, నలుగురు కార్మికుల మృతదేహాలు బయల్పడ్డాయి. అదే విధంగా శిథిలాల మధ్య చిక్కుకుని తీవ్రంగా గాయపడి వున్న మరో ఎనిమిదిమందిని కూడా పోలీసులు రక్షించారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో శివకాశి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో కార్మికుడు మృతి చెందాడు. మృతుల్లో ఒకరిని మునియాండి (40)గా పోలీసులు గుర్తించారు. శిథిలాల తొలగింపు సమయంలో కాసేపు వర్షం కురవటంతో అంతరాయం కలిగింది. అ తర్వాత వేగంగా శిథిలాలను తొలగించారు. జిల్లా ఎస్పీ ఎం.మనోహర్‌ ఇతర పోలీసులు అధికారులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.

Updated Date - 2022-01-02T14:56:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising