ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ డీఎస్పీ మోసం చేశారంటూ...

ABN, First Publish Date - 2022-04-26T17:22:33+05:30

మాజీ డీఎస్‌పీ మోసం చేశారంటూ ఒకే కుటుంబానికి చెందని ఏడుగురు వ్యక్తులు ఓవర్‌హెడ్‌ ట్యాంకుపైకి చేరి దూకేస్తామంటూ హల్‌ఛల్‌ చేసిన సంఘటన దొడ్డబళ్ళాపుర పరిధిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఏడుగురు ఆత్మహత్యాయత్నం

- ఒకే కుటుంబానికి చెందినవారే...


బెంగళూరు: మాజీ డీఎస్‌పీ మోసం చేశారంటూ ఒకే కుటుంబానికి చెందని ఏడుగురు వ్యక్తులు ఓవర్‌హెడ్‌ ట్యాంకుపైకి చేరి దూకేస్తామంటూ హల్‌ఛల్‌ చేసిన సంఘటన దొడ్డబళ్ళాపుర పరిధిలో చోటుచేసుకుంది. సోమవారం బెంగళూరు గ్రామీణ జిల్లా దొడ్డబళ్ళాపుర పరిధిలోని జేకేవీ లే అవుట్‌లోని ఓవర్‌హెడ్‌ ట్యాంకుపైకి ఏడుగురు వ్యక్తులు చేరారు. కాసేపటికే విషయం తెలియడంతో పోలీసులు, అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగాయి. ఇదే సందర్భంగా కుటుంబ పెద్ద ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ చింతామణి తాలూకా కొండవనళ్ళి గ్రామానికి చెందినవారమని ఇటీవల కొన్నేళ్ళుగా దొడ్డబళ్ళాపురలోనే నివసిస్తున్నట్లు తెలిపారు. బంధువైన మాజీ డీఎస్‌పీ కోనప్పరెడ్డి భూమి విషయంలో మోసం చేశారని ఆరోపించారు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. చింతామణి పోలీసులు ఫిర్యాదు కూడా తీసుకోవడం లేదన్నారు. మాజీ డీఎస్‌పీ కోనప్పరెడ్డి ఇక్కడకు వచ్చి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇస్తేనే కిందకు దిగుతామన్నారు. లేని పక్షంలో మూకుమ్మడిగా కిందకు దూకేస్తామన్నారు. పోలీసులు సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించారు. కాసేపటికే మరింత మంది పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేస్తామని కోనప్పరెడ్డిని విచారిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.

Updated Date - 2022-04-26T17:22:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising