ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ex Ministerపై అవినీతి కేసు

ABN, First Publish Date - 2022-05-22T14:32:06+05:30

గత అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన వైద్యలింగం రూ.28 కోట్ల నగదును లంచంగా స్వీకరించారని ఆర్పోర్‌ ఇయ్యక్కం సంచలన ఆరోపణలు చేసింది. దీనికి సంబంఽధించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

              - ఏసీబీకి ఆధారాల సమర్పణ

              - అర్పోర్‌ ఇయ్యక్కం ఆరోపణ


అడయార్‌(చెన్నై): గత అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన వైద్యలింగం రూ.28 కోట్ల నగదును లంచంగా స్వీకరించారని ఆర్పోర్‌ ఇయ్యక్కం సంచలన ఆరోపణలు చేసింది. దీనికి సంబంధించిన ఆధారాలను ఆ సంస్థ రాష్ట్ర అవినీతి నిరోధఖ శాఖ (ఏసీబీ)కి సమర్పించింది. ఇదే విషయంపై ఆ సంస్థ కన్వీనర్‌ జయరాం వెంకటేశన్‌ శనివారం విలేకరులతో మాట్లాడుతూ 2015-16 మధ్యకాలంలో మంత్రిగా ఉన్న వైద్యలింగం శ్రీరామ్‌ గ్రూపు నుంచి రూ.28 కోట్లను లంచంగా స్వీకరించారని, దీనికి సం బం ధించిన ఆదారాలను ఏసీబీకి సమర్పించినట్టు తెలిపా రు. 2015 -16లో నగర శివారు ప్రాంతమైన పెరుంగళత్తూరులో శ్రీరామ్‌ గ్రూపు 1,453 గృహాల బహుళ అంతస్తుల ప్రాజెక్టు నిర్మాణానికి 2013లో సీఎండీఏ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది. దీనికి రెండేళ్ల తర్వాత అనుమతి ఇచ్చారన్నారు. ఆ అనుమతి జారీ కోసం మాజీ మంత్రి వైద్యలింగం రూ.27.9 కోట్లను లంచంగా పుచ్చుకున్నారని తెలిపారు. ఈ మొత్తాన్ని ఆ గ్రూపునకు చెందిన భారత్‌ కోల్‌ కెమికల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ ద్వారా అన్‌ సెక్యూర్డ్‌ లోన్‌ పేరిట వైద్యలింగం కుమారుడు ప్రభుకు చెందిన ముత్తమ్మాళ్‌ ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు 2015 -16లో నిధులను బట్వాడా చేశారని వివరించారు. శ్రీరామ్‌ గ్రూపు ప్రారంభించిన ప్రాజెక్టుకు అనుమతి, ఈ నిధుల బట్వాడా ఏకకాలంలో జరిగిందని గుర్తుచేశారు. ఈ నిధులతో వైద్యలింగం కుమారుడు ప్రభు పాప్పకురిచ్చి ప్రాంతంలో 4.5 ఎకరాల భూములను రూ.24 కోట్లకు కొనుగోలు చేశారన్నారు. ఈ అంశంలో మాజీ మంత్రి వైద్యలింగం, ఆయన కుమారుడు ప్రభు, సీఎండీఏ అధికారులతో పాటు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 

Updated Date - 2022-05-22T14:32:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising