ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dumka Minor Girl: అత్యాచారం చేసి ఆపై చెట్టుకు ఉరేసిన ఆ బాలిక గర్భిణి.. షాకింగ్ విషయాలు వెల్లడించిన పోలీసులు

ABN, First Publish Date - 2022-09-04T23:58:18+05:30

ఝార్ఖండ్‌లోని దుమ్కా జిల్లా నేరాలకు నెలవుగా మారుతోంది. తన ప్రేమను అంగీకరించలేదని ఓ బాలికపై యువకుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుమ్కా: ఝార్ఖండ్‌లోని దుమ్కా జిల్లా నేరాలకు నెలవుగా మారుతోంది. తన ప్రేమను అంగీకరించలేదని ఓ బాలికపై యువకుడు పెట్రోలు పోసి తగలబెట్టిన ఘటన మరువక ముందే ఓ బాలికపై జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల తన కుమార్తెపై అత్యాచారం చేసి ఆపై చంపేసి చెట్టుకు వేలాడదీశారని బాధిత బాలిక తల్లి ఆరోపించింది. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగిందీ ఘటన. 


నిందితుడిని అర్మాన్ అన్సారీగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మాణ రంగ కార్మికుడు అయిన నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆమెను తొలుత హత్య చేసి ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చెట్టుకు ఉరివేశారా? లేదా? అన్న విషయం పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందని, నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్టు పోలీసులు తెలిపారు. దుమ్కా సివిల్ సర్జన్ మాత్రం బాలిక 8-10 నెలల గర్భవతి అని నిర్ధారించారు. నిందితుడు అర్మాన్ అన్సారీపై వీలైనంత త్వరగా చార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్టు పోలీసులు తెలిపారు. జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్ (NCPCR) సోమవారం గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని సందర్శించనుంది. 


బాధిత బాలిక దుమ్కాలో తన పిన్నమ్మతో కలిసి ఉండేది. ఈ క్రమంలో అన్సారీతో ఆమెకు సంబంధం ఏర్పడింది. అమ్మాయి తనను పెళ్లి చేసుకోమని అన్సారీని కోరగా అతడు ఆమెను చంపేశాడని చెబుతున్నారు. ఆ తర్వాత ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో గర్భిణి అని తేలింది.


ఈ ఘటనపై ఝార్ఖండ్ ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత బాలికపై అత్యాచారం చేసి ఆపై ఉరేశారని సీనియర్ బీజేపీ నేత బాబులాల్ మరాండీ ట్వీట్ చేశారు. ‘‘మీరు ఎవరిని కాపాడుతున్నారు? సిగ్గుపడండి. మీరు, మీ పోలీసులు ఏది దాచినా ఆమెకు న్యాయం చేస్తాం’’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.  

Updated Date - 2022-09-04T23:58:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising