ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ. 9.82 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత

ABN, First Publish Date - 2022-02-20T17:40:13+05:30

విదేశాల నుంచి కొరియర్‌ ద్వారా డ్రగ్స్‌ తెప్పించుకుని బెంగళూరులో విక్రయించేందుకు ప్రయత్నించిన ఇద్దరిని బెంగళూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు కస్టమ్స్‌ అధికారులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.9.82 కోట్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                  - విదేశాల నుంచి కొరియర్‌ ద్వారా సరఫరా


బెంగళూరు: విదేశాల నుంచి కొరియర్‌ ద్వారా డ్రగ్స్‌ తెప్పించుకుని బెంగళూరులో విక్రయించేందుకు ప్రయత్నించిన ఇద్దరిని బెంగళూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు కస్టమ్స్‌ అధికారులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.9.82 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కస్టమ్స్‌ అధికారులు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్వాధీనం చేసుకున్నవాటిలో ఏడుకోట్ల విలువైన హెరాయిన్‌ ఉండగా రూ.2.82 కోట్ల విలువ కలిగిన ఎండీఎంఏను గుర్తించారు. విదేశాల నుంచి ఎయిర్‌పోర్టుకు కొరియర్‌ ద్వారా తెప్పించుకున్నారు. రెండు కొరియర్‌లలో బెల్జియం, జాంబియా నుంచి దుబాయ్‌ మీదుగా బెంగళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చినట్లు గుర్తించారు. సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు ఎయిర్‌పోర్టు అధికారులను అప్రమత్తం చేసి పకడ్బందీ వ్యూహంతో ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. సమగ్ర దర్యాప్తు సాగిస్తున్నామని, వీటివెనుక కారకులెవరనే దిశగా విచారణ సాగిస్తున్నట్లు ప్రకటించారు. 

Updated Date - 2022-02-20T17:40:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising