ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

driver: ఇంటి యజమానురాలిపై డ్రైవరు దారుణం...ఏడాది కాలంగా అత్యాచారం

ABN, First Publish Date - 2022-10-07T15:32:39+05:30

ఓ ఇంట్లో కారు డ్రైవరుగా(driver) పనిచేస్తున్న యువకుడు 52 ఏళ్ల ఇంటి యజమానురాలిపై ఏడాది కాలంగా బెదిరించి అత్యాచారం చేసిన ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గురుగ్రామ్ : ఓ ఇంట్లో కారు డ్రైవరుగా(driver) పనిచేస్తున్న యువకుడు 52 ఏళ్ల ఇంటి యజమానురాలిపై ఏడాది కాలంగా బెదిరించి అత్యాచారం చేసిన ఘటన గురుగ్రామ్ నగరంలో తాజాగా వెలుగుచూసింది. గురుగ్రామ్(Gurgaon) నగరానికి చెందిన ఓ యువకుడు తన భర్త వద్ద డ్రైవరుగా పనిచేస్తూ ఇంటి పనుల్లో సాయం చేసేవాడని బాధిత మహిళ(Woman) పోలీసులకు చెప్పింది. 2019 డిసెంబరు 10వతేదీన తాను ఇంట్లో ఒంటరిగా ఉన్నపుడు డ్రైవరు తన గదిలోకి ప్రవేశించి తనను లైంగికంగా వేధించాడని బాధిత యజమానురాలైన మహిళ పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొంది. తాను ప్రతిఘటించడంతో నిందితుడైన డ్రైవరు తన భర్తను చంపేస్తానని బెదిరించి అత్యాచారం చేశాడని బాధితురాలు పేర్కొంది. 


నిందితుడు ఏడాదికి పైగా తనపై పదేపదే అత్యాచారం చేశాడని, తాను అడ్డుకోవడానికి యత్నిస్తే తన భర్తను చంపేస్తానని బెదిరించాడని మహిళ పోలీసులకు చెప్పింది.‘‘నేను చాలా కాలం మౌనంగా భరించాను, కానీ ఇప్పుడు నేను చివరకు అత్యాచారంపై పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాను’’ అని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.గురుగ్రామ్ సెక్టార్ 51లోని మహిళా పోలీస్ స్టేషన్‌లో డ్రైవర్‌పై ఐపీసీ సెక్షన్లు 376, 506ల కింద కేసు(police case) నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

Updated Date - 2022-10-07T15:32:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising