ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శృంగారానికి నిరాకరించిందని loverని చంపిన ప్రియుడు

ABN, First Publish Date - 2022-03-21T15:34:10+05:30

శృంగారానికి నిరాకరించిందనే కోపంతో ప్రియురాలిని కత్తితో పొడిచి చంపిన ప్రియుడి బాగోతం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో వెలుగుచూసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: శృంగారానికి నిరాకరించిందనే కోపంతో ప్రియురాలిని కత్తితో పొడిచి చంపిన ప్రియుడి బాగోతం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో వెలుగుచూసింది. చెన్నైలోని కుండ్రత్తూర్ ప్రాంతానికి చెందిన రాజా(38) అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళను గత ఐదేళ్లుగా ప్రేమిస్తున్నాడు. మహిళ అద్దె ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేటు కంపెనీలో కూలీగా పనిచేస్తుండేది. శనివారం రాత్రి పీకల దాకా మద్యం తాగిన రాజా ప్రియురాలి ఇంటికి వెళ్లి తనతో పడుకోమని బలవంతం చేశాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.ప్రియుడు, ప్రియురాలు గొడవ పడుతుండటంతో ఇరుగుపొరుగు వారు వచ్చి రాజాను ఇంటి నుంచి పంపించి వేశారు.


అందరూ నిద్రపోయాక తిరిగివచ్చిన రాజా ప్రియురాలిని బంధించి కత్తితో పొడిచి హతమార్చి పారిపోయాడు.రక్తపు మరకలతో ఉన్న షర్టు ధరించిన రాజా కుండ్రత్తూర్ వద్ద కూర్చొని ఉండగా గస్తీ పోలీసులు పట్టుకొని ప్రశ్నించగా హత్య విషయం వెలుగుచూసింది. తన ప్రియురాలిని హత్య చేసినట్లు రాజా అంగీకరించడంతో అతన్ని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు.


Updated Date - 2022-03-21T15:34:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising