ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sad: మీరు తిరిగొచ్చేసరికి మీ అమ్మ చచ్చి పడి ఉంటుంది.. ఈ మాట నాన్న చెప్పాడంటున్న కూతుళ్లు..

ABN, First Publish Date - 2022-04-30T01:13:47+05:30

‘మీరు స్కూల్ నుంచి తిరిగొచ్చే సరికి మీ అమ్మ చచ్చిపడి ఉంటుంది’ అని పప్పా అన్నారని, చివరకు అన్నంత పని చేశారని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత, జిల్లా పంచాయత్ సభ్యురాలు Shweta Singh Gaur (35) తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆమె చనిపోయిన తర్వాత నుంచి శ్వేత భర్త దీపక్ సింగ్ గౌర్ కనిపించకుండా పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్వేతా సింగ్ గౌర్ బీజేపీ పార్టీలో చురుగ్గా పనిచేసే వారు. చాంద్వారా నుంచి జిల్లా పంచాయత్ సభ్యురాలిగా కూడా ఎన్నికయ్యారు. బుధవారం సాయంత్రం ఆమె తన గదిలో విగత జీవిగా కనిపించింది. ఆ గది డోర్ లోపల పక్క లాక్ చేసి ఉంది. శ్వేత ఫ్యానుకు ఉరి వేసుకున్న స్థితిలో వేలాడుతూ కనిపించింది. గది లోపల ఎలాంటి సూసైడ్ నోట్ పోలీసులకు దొరకలేదు. శ్వేత భర్త దీపక్ సింగ్ గౌర్ కూడా బీజేపీలో చురుగ్గా పనిచేసేవాడు. అతను లిక్కర్ వ్యాపారి కూడా కావడం గమనార్హం. శ్వేతా సింగ్ గౌర్ అనుమానాస్పద మృతి కేసులో విచారణ చేస్తున్న పోలీసులకు కొన్ని కీలక విషయాలు తెలిశాయి. శ్వేతకు ఇద్దరు కుమార్తెలున్నారు. వారు చెప్పిన విషయం కేసులో కీలకంగా మారింది.



తాము ఘటన జరిగిన సమయంలో ఇంట్లో లేమని.. ఉదయాన్నే స్కూల్‌కు వస్తున్న తమతో నాన్న ఓ షాకింగ్ మాట అన్నాడని ఆమె కూతుర్లు చెప్పారు. ‘మీరు స్కూల్ నుంచి తిరిగొచ్చే సరికి మీ అమ్మ చచ్చిపడి ఉంటుంది’ అని పప్పా అన్నారని, చివరకు అన్నంత పని చేశారని శ్వేత కూతుర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు కూతుర్లంటే ఇష్టం లేదని, కొడుకు కావాలని అనుకున్నారని.. అలా జరగకపోవడంతో అప్పటి నుంచి తమ తల్లిని చిత్రహింసలకు గురిచేసేవాడని శ్వేత సింగ్ కూతుర్లు కన్నీరుమున్నీరయ్యారు.



సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని మోదీ తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అయితే.. ఈ ఘటన జరిగి 24 గంటలకు పైగానే అయినా ఇప్పటికీ నిందితులెవరనీ అదుపులోకి తీసుకోకపోవడం గమనార్హం. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. బాండా నగరంలోని ఇందిరా నగర్ పరిధిలో ఈ ఘటన జరిగింది. శ్వేతా సింగ్ గౌర్ అనుమానాస్పద మృతి ప్రస్తుతం బాందా జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

Updated Date - 2022-04-30T01:13:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising