ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈమె చేసిన పని ఏమిటో తెలిస్తే...

ABN, First Publish Date - 2022-06-02T14:01:33+05:30

నకిలీ పత్రాలు సమర్పించి రూ.97 లక్షల మోసానికి పాల్పడిన బ్యాంక్‌ మేనేజర్‌ను క్రైం విభాగం పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరియూర్‌కు చెందిన ఉమామహేశ్వరి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- పనిచేసేచోటే కన్నం !

- నకిలీ పత్రాలతో రూ.97 లక్షల మోసం

- బ్యాంక్‌ మేనేజర్‌ అరెస్టు


వేలూరు(చెన్నై), జూన్‌ 1: నకిలీ పత్రాలు సమర్పించి రూ.97 లక్షల మోసానికి పాల్పడిన బ్యాంక్‌ మేనేజర్‌ను క్రైం విభాగం పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరియూర్‌కు చెందిన ఉమామహేశ్వరి (38) వేలూరు కేంద్ర కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో గుడియాత్తం శాఖ మేనేజర్‌ ఉన్న సమయంలో ఆమె నకిలీ పత్రాలతో మహిళా స్వయం సహాయక బృందాల పేరిట రూ.97.37 లక్షల మేర రుణాలు మంజూరు చేసి అవినీతికి పాల్పడినట్లు బ్యాంక్‌ అధికారుల పరిశీలనలో తెలిసింది. దీనిపై కో-ఆపరేటివ్‌ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ పరంజ్యోతి ఫిర్యాదు మేరకు జిల్లా వర్తక క్రైం విభాగం పోలీసులు విచారణ జరిపి, మేనేజర్‌ అవినీతికి పాల్పడి ఆ నగదుతో చెన్నై, వేలూరు, కాట్పాడి ప్రాంతాల్లో ఇళ్లు, స్థలాలు కొనుగోలు చేసినట్లు నిర్ధారణ కావడంతో ఆమెను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరచి వేలూరు మహిళా కారాగారానికి తరలించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆమెపై సస్పెన్షన్‌ వేటుపడింది.

Updated Date - 2022-06-02T14:01:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising