ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రియురాలిపై కోపం... వాహనానికి నిప్పు

ABN, First Publish Date - 2022-12-16T12:49:26+05:30

జైలుకు వెళ్ళేందుకు ప్రియురాలే కారణమని భావించి ఆమె వాడే వాహనానికి ప్రియుడు నిప్పుపెట్టినట్లు గుర్తించిన పోలీసులు అ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, డిసెంబరు15 (ఆంధ్రజ్యోతి): జైలుకు వెళ్ళేందుకు ప్రియురాలే కారణమని భావించి ఆమె వాడే వాహనానికి ప్రియుడు నిప్పుపెట్టినట్లు గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 12న హలసూరులోని యువతి ఇంటిముందు ఆపిన స్కూటర్‌పై పెట్రోలు పోసి నిప్పుపెట్టి పరారీ అయ్యారు. యువతి ఫిర్యాదు మేరకు హలసూరు(Halasur) పోలీసులు విక్రం అనే యువకుడిని గురువారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు హలసూరుకు చెందిన యువతి టాటూ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. విక్రంతో రెండుమూడేళ్ళుగా పరిచయం ఉందన్నారు. ఆతర్వాత ఇరువురి మధ్య ప్రేమగా మారిందన్నారు. ఇటీవల ఏడాదికి పైగా విక్రం డ్రగ్‌ పెడ్లర్‌గా మారడంతో యువతి విక్రంను దూరంగా ఉంచారన్నారు పలుమార్లు యువతి డ్రగ్స్‌ విక్రయాలకు దూరంగా ఉండాలని సూచించినా విక్రం పట్టించుకోక పోవడంతో ఇరువురి మధ్య స్నేహం కూడా దూరమైందన్నారు. ఇదే తరుణంలోనే విక్రంపై బీటీఎం లేఅవుట్‌, కోరమంగళ, మడివాళతో పాటు పలు పోలీసుస్టేషన్‌లలో మోస్ట్‌ వాంటెడ్‌గా మారిపోయారు. మడివాళ పోలీసులు కేసు నమోదు చేసుకుని విక్రంను అరెస్టు చేశారు. సుమారు ఎనిమిది నెలల పాటు జైలులో గడిపిన విక్రం ఇటీవలే బెయిలుపై బయటకు వచ్చారు. కేసు నమోదై అరెస్టు అయ్యేందుకు ప్రియురాలే కారణమని భావించి ఆమె వాహానినికి నిప్పుపెట్టినట్లు అంగీకరించారన్నారు. కేసు నమోదు చేసి జైలుకు పంపినట్లు తెలిపారు.

Updated Date - 2022-12-16T12:49:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising