ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏసీబీ వలలో క్రైమ్‌ ఎస్‌ఐ

ABN, First Publish Date - 2022-03-09T18:01:36+05:30

ద్విచక్ర వాహనదారుడి నుంచి రూ. 5 వేలు లంచం తీసుకుంటూ కంప్లి పట్టణ క్రైమ్‌ ఎస్‌ఐ బసప్ప లంబాణీ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అధికారులు తెలిపిన వివరాల మేరకు.. నారాయణస్వామి అనే వడ్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కంప్లి(కర్ణాటక): ద్విచక్ర వాహనదారుడి నుంచి రూ. 5 వేలు లంచం తీసుకుంటూ కంప్లి పట్టణ క్రైమ్‌ ఎస్‌ఐ బసప్ప లంబాణీ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అధికారులు తెలిపిన వివరాల మేరకు.. నారాయణస్వామి అనే వడ్ల వ్యాపారిని గతంలోనే రూ. 10 వేలు మామూలు ఇవ్వాలని ఎస్‌ఐ బసప్ప లంబాణీ డిమాండ్‌ చేశాడు. నారాయణస్వామి తనతో లేవని, ఉన్నప్పుడు ఇస్తానని చెబుతూ వచ్చాడు. వారం రోజుల క్రితం నారాయణస్వామి ద్విచక్రవాహనంలో ఇతర పనులపై పోలీస్‌ స్టేషన్‌కు రాగా వాహన డాక్యుమెంట్లు చూపించాలని ఎస్‌ఐ ప్రశ్నించాడు. వాహనం తన అన్న కుమారుడి పేరుపై వున్నట్లు చెప్పాడు. వారినే వచ్చి ఈ బండి తీసుకెళ్లాలని ఎస్‌ఐ తాళాలు ఇప్పించుకున్నాడు. దీంతో నారాయణ స్వామి బళ్లారిలోని ఏసీబీ అధికారులను సంప్రదించాడు. మంగళవారం నారాయణస్వామి ఎస్‌ఐకి రూ. 5 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు హరిబాబు, సూర్యనారాయణరావు, ప్రభులింగ హిరేమట్‌, సుందరేష్‌, కొల్లన్న తదితరులు పట్టుకున్నారు. అనంతరం ఎస్‌ఐపై కేసు నమోదు చేశారు. 

Updated Date - 2022-03-09T18:01:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising