ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Zomato నష్టాలు సగానికి తగ్గాయ్.. షేర్లు ఆకాశానికి ఎగిశాయ్..

ABN, First Publish Date - 2022-08-02T16:17:03+05:30

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Zomato Shares : ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. ఈ త్రైమాసికంలో జొమాటో నష్టాలను సగానికి పైగా తగ్గించుకుంది. దీంతో జొమాటో షేర్లకు రెక్కలొచ్చాయి. బీఎస్ఈలో 9 శాతం పెరిగి రూ.50.45కి చేరుకున్నాయి. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో నికర నష్టాలు దాదాపు సగానికి తగ్గి రూ. 186 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 361 కోట్ల నికర నష్టం నమోదైంది. 


మొత్తం ఆదాయం సైతం రూ. 917 కోట్ల నుంచి రూ. 1,582 కోట్లకు ఎగసింది. ఇక మొత్తం వ్యయాలు రూ. 1,260 కోట్ల నుంచి రూ. 1,768 కోట్లకు పెరిగాయి. మార్కెట్​లో పరిస్థితులకు తగ్గట్టు.. లాభదాయకత అంశంపై తమ దృష్టి మారిందని.. దీర్ఘకాలం వృద్ధిని దృష్టిలో పెట్టుకుని వనరులను ఉపయోగించుకుంటున్నామని జొమాటో సహ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్​ గోయల్​ వెల్లడించారు. అలాగే బ్లింకిట్‌ కొనుగోలు ప్రతిపాదనకు వాటాదారుల నుంచి 97 శాతం ఓట్లు లభించినట్లు వెల్లడించారు. ఒప్పందం ముగిసిన తర్వాత బ్లింకిట్​ ఫైనాన్షియల్స్​.. జొమాటోలోకి కన్సాలిడేట్​ అవుతుందని తెలిపారు. కాగా.. జొమాటోలోని హైపర్​ప్యూర్​ విభాగం రానున్న రోజుల్లో మెరుగ్గా రాణిస్తుందని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.


Updated Date - 2022-08-02T16:17:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising