ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక చిన్న న్యూస్‌తో Zomato షేర్లు ఢమాల్.. 9% పడిపోయాయ్..

ABN, First Publish Date - 2022-08-03T18:36:07+05:30

కంపెనీ గురించి ఒక న్యూస్ బయటకు వచ్చిందంటే చాలు.. దానిలో నిజానిజాలను పక్కనబెట్టి ఆ కంపెనీ షేర్లు మాత్రం చిగురుటాకులా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Zomato Shares : కంపెనీ గురించి ఒక న్యూస్ బయటకు వచ్చిందంటే చాలు.. దానిలో నిజానిజాలను పక్కనబెట్టి ఆ కంపెనీ షేర్లు మాత్రం చిగురుటాకులా వణికిపోతాయి. జొమాటో(Zomato) విషయంలోనూ ఇదే జరిగింది. ఇండియన్ ఫుడ్ డెలివరీ సంస్థలో ఉబర్ టెక్నాలజీస్(Uber Technologies) తన మొత్తం 7.8% వాటాను విక్రయించే అవకాశం ఉందని ఒక న్యూస్ బయటకొచ్చింది. అంతే జొమాటో షేర్లు అమాంతం పడిపోయాయి. ఈరోజు ప్రారంభ ట్రేడ్‌(Early trade)లో కంపెనీ షేర్లు 9% పైగా పడిపోయాయి. 


బీఎస్‌ఈ(BSE)లో గత ముగింపు రూ.55.60తో పోలిస్తే జోమాటో స్టాక్(Zomato Stock) 9.62 శాతం పతనమై రూ.50.25కి చేరుకుంది. Zomato స్టాక్ 5-రోజులు.. 20-రోజుల మూవింగ్ యావరేజ్‌ల కంటే ఎక్కువగా ట్రేడ్ అవుతుంది కానీ 50-రోజులు, 100-రోజులు, 200-రోజుల మూవింగ్ యావరేజ్‌ల కంటే మాత్రం తక్కువగా ట్రేడవుతోంది. ఈ స్టాక్ 2022లో 60 శాతం పడిపోయింది. ఒక ఏడాది కాలంలో 61 శాతం నష్టపోయింది.


నవంబర్ 16, 2021న కంపెనీ షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.169.10కి చేరగా, జూలై 7, 2022న 52 వారాల కనిష్ట స్థాయి రూ.40.55కి చేరింది. సంస్థ మొత్తం 6,751.86 లక్షల షేర్లు బీఎస్‌ఈలో రూ. 3,439 కోట్ల టర్నోవర్‌గా మారాయి. మొత్తానికి ఒక్క న్యూస్‌తో బీఎస్ఈలో కంపెనీ మార్కెట్ క్యాప్(Zomato Market Cap) రూ.43,064 కోట్లకు పడిపోయింది.


Updated Date - 2022-08-03T18:36:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising