ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Zomato shares : జొమాటో షేర్లు హోల్డ్ చేశారా?.. జర జాగ్రత్త.. ఇదీ తాజా పరిస్థితి

ABN, First Publish Date - 2022-07-27T19:06:47+05:30

తీవ్ర ఒడుదుడుకులకు లోనవుతున్న జొమాటో షేర్లు(Zomato shares) ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : తీవ్ర ఒడుదుడుకులకు లోనవుతున్న జొమాటో షేర్లు(Zomato shares) ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. నష్టాల బాటలో సాగుతున్న ఈ స్టాక్‌ను వదిలించుకునేందుకు పెట్టుబడిదారులు ఇటివల వెల్లువెత్తుతున్నారు. ఈ క్రమంలో వెంచర్ క్యాపిటల్ సంస్థ మూరే స్ట్రాటజిక్ వెంచర్స్(Moore Strategic Ventures) ఏకంగా 4.25 కోట్ల షేర్లు విక్రయించింది. ప్రీ-ఐపీవో ఇన్వెస్టర్‌(Pre-IPO Investor) అయిన మూరే కొంతనష్టానికే షేర్లును అమ్మింది. ఒక్కో జొమాటో షేరును రూ.44 వద్ద అమ్మినట్టు బ్లాక్ డీల్ డేటా చెబుతోంది. ఈ డీల్ విలువ రూ.187 కోట్లుగా ఉందని డేటా స్పష్టం చేసింది. ఐపీవోకు ముందు రూ.191 కోట్లతో ఈ వాటాను దక్కించుకుంది. దీంతో మూరే సంస్థకు మొత్తం రూ.4 కోట్ల నష్టం వాటిల్లింది. అమెరికాలోని న్యూయార్క్ కేంద్రంగా మూరే వెంచర్స్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. జనవరి 2021లో నెగ్సస్ వెంచర్స్(Nexus Ventures) నుంచి కన్వర్టబుల్ జీ-సిరీస్ షేర్లను రూ.191 కోట్ల విలువతో కొనుగోలు చేసింది. కాగా గతేడాది జులైలో జొమాటో స్టాక్ మార్కెట్లపై ఒక్కో షేరు రూ.126 వద్ద లిస్టింగ్‌కు వచ్చిన విషయం తెలిసిందే.


మరిన్ని విక్రయాలు.. బీ అలర్ట్..

జొమాటో షేర్ల పతనం కొనసాగుతున్న నేపథ్యంలో మరికొంత మంది ప్రీ-ఐపీవో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. జొమాటో మార్కెట్ క్యాపిటలైజేషన్ క్రితం కనిష్ఠ స్థాయి 5.5 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది. ఈ నేపథ్యంలో షేర్లు విక్రయం కొనసాగవచ్చని హెచ్చరిస్తున్నారు. కాగా 613 కోట్ల షేర్లు లేదా 78 శాతం షేర్లకు సంబంధించిన ఒక ఏడాది లాక్-ఇన్ పిరియడ్(Lock in period) గతవారం జులై 23(శనివారం) ముగియడం ఇందుకు ప్రధాన కారణమంటున్నారు. కాబట్టి ఈ వారంలో జొమాటో షేర్ ప్రైస్ మరింత దిగజారే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అప్రమత్తం చేస్తున్నారు.

Updated Date - 2022-07-27T19:06:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising