ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2022లో లక్ష కోట్లు దాటిన ఎఫ్‌పీఐ నిధుల ఉపసంహరణ

ABN, First Publish Date - 2022-06-13T09:41:43+05:30

2022లో లక్ష కోట్లు దాటిన ఎఫ్‌పీఐ నిధుల ఉపసంహరణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్‌ నుంచి విదేశీ మదుపరుల నిఽ దుల ఉపసంహరణ నిరాఘాటంగా సాగిపోతూనే ఉంది. జూన్‌ నెలలో ఇప్పటివరకు ఎఫ్‌పీఐలు ఉపసంహరించిన నిధులు రూ.13888 కోట్లు. ఈ ఏడాది మొత్తం మీద ఇప్పటివరకు వారు ఉపసంహరించిన నిధుల పరిమాణం రూ.1.18 లక్షల కోట్లు. రాబోయే కాలంలో కూడా ఈ నిధుల ఉపసంహరణ కొనసాగే ఆస్కారం ఉన్నదని, అయితే మధ్యకాలంలో   మాత్రం అమ్మకాల జోరు తగ్గవచ్చునని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు.


దేశంలో ఏర్పడిన ఆర్థిక మాంద్య పరిస్థితులు, ప్రపంచ దేశా ల కేంద్ర బ్యాంకులు అనుసరిస్తున్న కఠిన ద్రవ్యవిధానం, అధిక ద్రవ్యోల్బణం ఇందుకు కారణాలని విశ్లేషకులంటున్నారు. ఇటీవల ఆర్‌బీఐ ద్రవ్యవిధానంలో ఈ ఏడాది  ద్రవ్యోల్బణం 6 శాతం పైబడే ఉండవచ్చునని అంచనావేసింది. మూడు త్రైమాసికాల పాటు ఆర్థిక రంగంలో మందగమం ఉన్నట్టయితే బాండ్లపై రాబడులు కూడా తగ్గుతాయని, ఎఫ్‌పీఐల నిధుల ఉపసంహరణకు ఇది కూడా ఒక కారణమని అంటున్నారు. ఈ నిధుల ఉపసంహరణ ప్రభావం స్టాక్‌ మార్కెట్‌పై తీవ్రంగానే పడింది. ఇటీవల కాలంలో స్టాక్‌ మార్కెట్లో ఆటుపోట్లు పెరిగి సూచీలన్నీ కనిష్ఠ స్థాయిలకు దిగజారడానికి కూడా ఈ నిధుల ఉపసంహరణే కారణం. 

Updated Date - 2022-06-13T09:41:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising