ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

wipro: విప్రో కీలక నిర్ణయం.. ఉద్యోగులు ఇకపై వారంలో 3 రోజులపాటు..

ABN, First Publish Date - 2022-10-05T21:46:40+05:30

దేశీయ ఐటీ దిగ్గజం విప్రో (Wipro) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సమయంలో ప్రవేశపెట్టిన వర్క్‌ ఫ్రమ్ హోం (Work from Home) విధానానికి స్వస్తి పలకడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశీయ ఐటీ దిగ్గజం విప్రో (Wipro) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సమయంలో ప్రవేశపెట్టిన వర్క్‌ ఫ్రమ్ హోం (Work from Home) విధానానికి సంపూర్ణంగా స్వస్తి పలకడమే లక్ష్యంగా ముఖ్యమైన ప్రకటన చేసింది. వారంలో కనీసం 3 రోజులు ఆఫీస్‌ నుంచి పనిచేయాలని ఉద్యోగులను కోరింది.  ఈ నూతన విధానం అక్టోబర్ 10 నుంచి అమల్లోకి వస్తుందని ఈ-మెయిల్స్ ద్వారా ఉద్యోగులందరికీ సమాచారం అందించింది. వచ్చేవారం నుంచి భారత్‌లోని కంపెనీ కార్యాలయాలు వారంలో 4 రోజులు తెరిచే ఉంటాయని, ఉద్యోగులు కనీసం మూడు రోజులపాటు ఆఫీస్‌కి రావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.  లీడర్‌షిప్ బాధ్యతల్లో ఉన్నవాళ్లు కూడా వారంలో 3 రోజులు ఆఫీస్‌ల నుంచే చేయాల్సి ఉంటుందని పేర్కొంది.


‘‘ సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో ఆఫీస్‌లు తెరిచివుంటాయి. అక్టోబర్ 10 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుంది. బుధవారాల్లో ఆఫీస్ ఓపెన్ ఉండదు.’’ అని ఈ- మెయిల్స్‌లో విప్రో వెల్లడించింది. కార్యాలయాల్లో పనిచేస్తే ఉద్యోగుల మధ్య స్నేహం, పరస్పర సహకారం పెరుగుతాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. పని విషయంలో కూడా సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొంది. 


రిటర్న్- టు- వర్క్ విషయంలో కంపెనీ ఫ్లెక్సిబుల్, హైబ్రీడ్ విధానాన్ని ఎంచుకుందని విప్రో ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఉద్యోగులు బృందంగా పనిచేయడాన్ని అస్వాధించవచ్చునని, పరస్పర సహకారం, స్నేహం పెరుగుతాయని విప్రో ప్రతినిధి ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఇటివలే టీసీఎస్ కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు వారంలో కనీసం 3 రోజులైనా ఆఫీస్ నుంచి పనిచేయాలని ఉద్యోగులకు ఈ-మెయిల్స్ ద్వారా సమాచారమిచ్చిన విషయం తెలిసిందే. 


కాగా ఐటీ రంగం ప్రస్తుతం కష్టకాలాన్ని ఎదుర్కొంటోంది. విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహింద్రా వంటి దిగ్గజం కంపెనీలు ఇటివల పలువురి జాబ్ ఆఫర్ లెటర్లు రద్దు చేసినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు జాబ్ ఆఫర్లు ఇచ్చి కూడా జాయినింగ్ చేసుకోవడంలో కంపెనీలు జాప్యం చేస్తున్నాయని పలువురు ఫ్రెషర్లు వాపోతున్నారు.

Updated Date - 2022-10-05T21:46:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising