ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘టిక్‌టాక్’... మళ్ళీ రాబోతోందా ?

ABN, First Publish Date - 2022-01-28T01:15:01+05:30

టిక్‌టాక్... భారత్‌లో నిషేధానికి గురైన విషయం తెలిసిందే. కాగా.. ఇది ఇండియాలోకి అడుగుపెట్టబోతోందా ?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : టిక్‌టాక్... భారత్‌లో నిషేధానికి గురైన విషయం తెలిసిందే. కాగా.. ఇది ఇండియాలోకి అడుగుపెట్టబోతోందా ? ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్... చైనా షార్ట్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌ను కొనుగోలు చేయనుందా ? ఈ ప్రశ్నలకు ‘అవును’ అన్న సమాధానమే వినవస్తోంది. అదే జరిగినపక్షంలో... దేశీయ యాప్స్ పరిస్థితి ఎలా ఉంటుంది ? టిక్‌టాక్ ప్రభంజనంతో దేశీయ వినియోగదారులు స్థానిక యాప్స్‌వేపు పెద్దగా చూడలేదన్న విషసయం తెలిసిందే. టిక్‌టాక్ నిషేధంతో దేశీయ యాప్స్‌కు ఆదరణ పెరిగే క్రమంలో... టిక్‌టాక్ మళ్లీ వస్తుందన్న వార్తలతో... వాటి పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయమై చర్చోపచర్చలు నడుస్తున్నాయి. 


టిక్‌టాక్‌ను భారత్‌లో మళ్ళీ ప్రవేశపెట్టేందుకుగాను... విస్తృత స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లుగా వినవస్తోంది. టిక్‌టాక్  ఇండియాను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయనుందని,  అలాగే టిక్‌టాక్ యూఎస్‌ను మైక్రోబ్లాగింగ్ ట్విట్టర్ కొనుగోలు చేసేందుకు ప్రాథమిక చర్చలు జరిపినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ఈ క్రమానికి సంబంధించి మరిన్ని వివరాలిలా ఉన్నాయి. టిక్‌టాక్ స్థానంలో ఉన్న దేశీయ యాప్స్ పై పెట్టుబడిదారులు ఇప్పటికే పెట్టుబడులు పెడుతుండడం, మరిన్ని పెట్టుబడులకు సిద్ధమవుతుండడం తెలిసిందే. కాగా... ఇంతలోనే ఇండియాకు మళ్లీ టిక్‌టాక్ రానుందన్న ఊహాగానాల నేపథ్యంలో పెట్టుబడిదారులు ఈ యాప్‌పై పెట్టుబడులు పెట్టే దిశగా చూస్తున్నట్లు వినవస్తోంది. 


కాగా... షార్ట్ వీడియో షేరింగ్ మార్కెట్‌కు సంబంధించి... గత కొద్ది రోజులుగా పరిస్థితులు మారిపోతున్న విషయం తెలిసిందే. షార్ట్ వీడియో షేరింగ్ మార్కెట్‌లో పెట్టుబడులకు అవకాశముందన్న విషైయం తెలిసిందే. అయితే...  షార్ట్ వీడియో షేరింగ్ మార్కెట్‌లో... టిక్‌టాక్ క్లోన్‌కు బదులుగా టిక్‌టాక్ ద్వారానే మెరుగైన లాభాలను పొందవచ్చునని ఇన్వెంటస్ క్యాపిటల్ పార్ట్‌నర్స్ మేనేజింగ్ డైరెక్టర్ రుత్విక్ దోషి పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-28T01:15:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising