ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంగారం దిగుమతులపై పన్ను తగ్గింపు ?

ABN, First Publish Date - 2022-01-19T20:37:46+05:30

గత కొద్ది రోజులుగా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు దాదాపు స్థిరంగానే ఉన్న విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐదు శాతం వరకు తగ్గవచ్చని అంచనాలు... 

అదే జరిగితే... తగ్గనున్న ధర..!

న్యూఢిల్లీ : గత కొద్ది రోజులుగా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు దాదాపు స్థిరంగానే ఉన్న విషయం తెలిసిందే. కరోనా ప్రభావం నేపధ్యంలో... కొద్ది రోజుల క్రితం ధరలు పెరిగినప్పటికీ, ఇటీవల ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో తగ్గుతూ వస్తున్నాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజి(ఎంసీఎక్స్)లో గోల్డ్ ఫ్యూచర్ ధరలు ప్రస్తుతం రూ. 48 ంూతకు దిగువనే ఉన్నాయి. డాలర్ మారకంతో రూపాయి విలువ ఇటీవల బలపడడం, బడ్జెట్‌కు ముందు అప్రమత్తత ప్రభావం తదితర పరిణామాలు బంగారంపై కనిపిస్తోంది. కాగా... రానున్న బడ్జెట్‌లో బంగారంపై పన్నులను తగ్గించినపక్షంలో... ఈ ధరలు మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


కాగా... కరోనా నేపధ్యంలో బడ్జెట్‌పై పలు అంచనాలున్నాయి. ఆయా రంగాలు, సంస్థలు, ఉద్యోగులు, ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. బంగారంపై నాలుగు శాతం దిగుమతి సుంకం తగ్గనుందని భావిస్తున్నారు. కరోనా కారణంగా దాదాపు రెండేళ్లుగా కునారిల్లిన ఈ రంగం... ఇటీవలనుంచే కాస్త పుంజుకుంటోంది. ఈ క్రమంలో... జెవెలరీ రంగం మరింత కోలుకోవడానికి దిగుమతి సుంకాలను తగ్గించవచ్చునని భావిస్తున్నారు. జ్యువెల్లరీ రంగం కూడా దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కోరుతోంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్న విషయం తెలిసిందే.  ఈ బడ్జెట్‌లో దిగుమతి సుంకాన్ని 12.5 శాతం నుండి 7.5 శాతానికి తగ్గించవచ్చునని భావిస్తున్నారు. ఈ క్రమంలో... బంగారం ధర తగ్గుతుందన్న అభిప్రాయాలు సర్వత్రా వినవస్తున్నాయి. 

Updated Date - 2022-01-19T20:37:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising