ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫార్వార్డెడ్ మెసేజ్‌‌లపై వాట్సాప్ సంచలన నిర్ణయం

ABN, First Publish Date - 2022-04-04T00:52:53+05:30

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రూప్ చాట్‌లకు విచ్చలవిడిగా పోటెత్తుతున్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రూప్ చాట్‌లకు విచ్చలవిడిగా పోటెత్తుతున్న ఫార్వార్డెడ్ మెసేజ్‌లకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది.  ఇందుకోసం ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్ల కోసం ప్రత్యేకంగా ఓ ఫీచర్‌ను తీసుకొస్తోంది.


దీనిని ఇప్పటికే కొన్ని బీటావెర్షన్లలో పరీక్షిస్తోంది. వాట్సాప్ గ్రూపుల్లో చెలరేగిపోతున్న ఫార్వార్డ్ మెసేజ్‌లను ఈ ఫీచర్ అడ్డుకుంటుంది. ఒక మెసేజ్‌ను ఒకటి కంటే ఎక్కువ గ్రూపులకు ఫార్వార్డ్ కాకుండా ఇది అడ్డుకుంటుంది. అంటే ఒకే మెసేజ్‌ను పలు గ్రూపులకు ఫార్వార్డ్ చెయ్యడం ఇక కుదరదన్నమాట. ఫలితంగా స్పామ్ మెసేజ్‌లకు అడ్డుకట్ట వేయొచ్చన్నది వాట్సాప్ ఆలోచన.


ఈ మేరకు వాట్సాప్ ట్రాకర్ ‘వాబీటా ఇన్ఫో’ పేర్కొంది. ఈ కొత్త ఫీచర్ ఫార్వార్డ్ మెసేజ్‌కు మాత్రమే వర్తిస్తుంది. దీనిని ఇప్పటికే కొన్ని ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లలో ప్రవేశపెట్టింది. త్వరలోనే మరికొన్ని వెర్షన్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే మాత్రం వాట్సాప్ మెసేజ్‌ను ఒకటి కంటే ఎక్కువ గ్రూపులకు ఫార్వార్డ్ చేసే అవకాశాన్ని యూజర్లు కోల్పోతారు.

Updated Date - 2022-04-04T00:52:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising