ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖకు విరించి హాస్పిటల్‌

ABN, First Publish Date - 2022-07-31T07:15:20+05:30

విరించి లిమిటెడ్‌ అనుబంధ సంస్థయిన విరించి హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తన కార్యకలాపాలను విశాఖపట్నంకు విస్తరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌  (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): విరించి లిమిటెడ్‌ అనుబంధ సంస్థయిన విరించి హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తన కార్యకలాపాలను విశాఖపట్నంకు విస్తరించింది. విశాఖలోని వెల్‌కమ్‌ హాస్పిటల్స్‌కు చెందిన ఆసుపత్రిని లీజుకు తీసుకుంది. ఈ మేరకు వెల్‌కమ్‌ హాస్పిటల్స్‌తో విరించి హెల్త్‌కేర్‌ లీజింగ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఆసుపత్రిలో 81,000 చదరపు అడుగుల స్థలం ఉంటుందని విరించి హెల్త్‌కేర్‌ వెల్లడించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో హెల్త్‌కేర్‌ సేవలందిస్తున్న కంపెనీ దేశవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించాలని భావిస్తోంది. మొత్తం 700 పడకల సామర్థ్యంతో హైదరాబాద్‌లో మూడు ఆసుపత్రులను విరించి హెల్త్‌కేర్‌ నిర్వహిస్తోంది. విశాఖలో లీజుకు తీసుకున్న ఆసుపత్రిలో 250 పడకలు ఉంటాయని కంపెనీ తెలిపింది. ఈ సామర్థ్యాన్ని 350 పడకల వరకూ పెంచుకునే వెసులుబాటు ఉంది. విశాఖలోని ఆసుపత్రి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు లేదా మూడో త్రైమాసికాల్లో కార్యకలాపాలను ప్రారంభించే వీలుంది. విశాఖలోని ఆసుపత్రి ప్రారంభమైతే.. విరించి మల్టీసిటీ హాస్పిటల్‌ చెయిన్‌ అవుతుంది.

Updated Date - 2022-07-31T07:15:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising