ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Festive Bonanza: పండుగ బొనాంజ.. ఆకర్షణీయ ఆఫర్ ప్రకటించిన యునిటీ బ్యాంక్..

ABN, First Publish Date - 2022-10-04T01:59:57+05:30

కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా బ్యాంకులు ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా బ్యాంకులు ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఈ తరహాలోనే యునిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ (Unity Bank) దసరా, దీపావళి ముందు తన కస్టమర్లకు పండగ బొనాంజా (Festive Bonanza) ఆఫర్ ప్రకటించింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల(FD)పై వడ్డీ రేట్లను గణనీయంగా పెంచింది. ఇకపై 501 - రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై కస్టమర్లు 7.90 శాతం ఆకర్షణీయ వార్షిక వడ్డీని పొందొచ్చని బ్యాంక్ వెల్లడించింది. ఇక సీనియర్ సిటిజన్లు ఇంకాస్త ఎక్కువగా 8.40 శాతం వార్షిక వడ్డీని అందుకోవచ్చని తెలిపింది. అయితే ఈ ప్రత్యేక ఫెస్టివ్ ఆఫర్ అక్టోబర్ 31, 2022 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఖాతాదారులకు తెలియజేసింది.


మరోవైపు కేలబుల్ (Callable), నాన్-కేలబుల్ (Non-Callable) బల్క్ డిపాజిట్స్‌పై (రూ.2 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్లు) వడ్డీ రేట్లను కూడా సవరించినట్టు బ్యాంక్ తెలిపింది. కేలబుల్ బల్క్ డిపాజిట్లపై వార్షిక వడ్డీరేటు 7 శాతం వరకు ఆఫర్ చేయగా... నాన్-కేలబుల్ బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేటు 7.25 శాతంగా ఉంది. వడ్డీ రేట్ల సవరణ అక్టోబర్ 1, 2022 నుంచే అమల్లోకి వచ్చినట్టు యునిటీ బ్యాంక్ వెల్లడించింది.

Updated Date - 2022-10-04T01:59:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising