ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆగని ఎఫ్‌పీఐల అమ్మకాల హోరు

ABN, First Publish Date - 2022-07-04T10:30:08+05:30

దేశీయ స్టాక్‌ మార్కెట్లో ఎఫ్‌పీఐల అమ్మకాల హోరు కొనసాగుతోంది. జూన్‌ నెలలోనూ ఈ సంస్థలు రూ.50,203 కోట్ల పెట్టుబడుల్ని వెనక్కి తీసుకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జూన్‌లో రూ.50,203 కోట్ల అమ్మకాలు

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్‌ మార్కెట్లో ఎఫ్‌పీఐల అమ్మకాల హోరు కొనసాగుతోంది. జూన్‌ నెలలోనూ ఈ సంస్థలు రూ.50,203 కోట్ల పెట్టుబడుల్ని వెనక్కి తీసుకున్నాయి. ఎఫ్‌పీ ఐలు గత రెండేళ్లలో ఎన్నడూ ఒక నెలలో ఇంత మొత్తంలో పెట్టుబడుల్ని వెనక్కి తీసుకోలేదు. గత తొమ్మిది నెలల నుంచీ భారత మార్కెట్లో ఈ సంస్థల అమ్మకాల హోరు కొనసాగుతోంది. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు, కోరలు చాస్తున్న ద్రవ్యోల్బణం, భారత స్టాక్‌ మార్కెట్‌ అధిక పీఈ వద్ద ట్రేడవుతున్నదనే అంచనాలు ఇందుకు ప్రధాన కారణం.


ఆరు నెలల్లో రూ.2.2 లక్షల కోట్లు: ఈ సంవత్సరం జనవరి నుంచి చూస్తే ఇప్పటి వరకు ఎఫ్‌పీఐలు రూ.2.2 లక్షల కోట్ల పెట్టుబడుల్ని భారత స్టాక్‌ మార్కెట్‌ నుంచి వెనక్కి తీసుకున్నాయి. గతంలో ఎన్నడూ ఆరు నెలల వ్యవధిలో ఈ సంస్థలు ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడుల్ని వెనక్కి తీసుకోలేదు. వీటి అమ్మకాల హోరుతో డాలర్‌తో రూపాయి మారకం రేటు రోజురోజుకీ పడిపోతూ వస్తోంది. ఇప్పటికే డాలర్‌తో రూ.79 దాటిన రూపాయి మారకం రేటు.. త్వరలోనే రూ.81కి దిగజారే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. 

Updated Date - 2022-07-04T10:30:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising