ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూబీఐ లాభం రూ.1,558 కోట్లు

ABN, First Publish Date - 2022-07-27T06:58:04+05:30

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ).. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన రూ.1,558 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ).. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన రూ.1,558 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికం (రూ,1,181 కోట్లు)తో పోల్చితే నికర లాభం 32 శాతం వృద్ధి చెందింది. మొండి బకాయిలు (ఎన్‌పీఏ) తగ్గటం, నికర వడ్డీ ఆదాయం పెరగటం కలిసివచ్చిందని యూబీఐ ఎండీ, సీఈఓ మణిమేఖలై తెలిపారు. త్రైమాసిక సమీక్షా కాలంలో నికర వడ్డీ ఆదాయం 8.11 శాతం పెరిగి రూ.7,582 కోట్లకు చేరగా స్థూల మొండి బకాయిలు 13.6 శాతం నుంచి 10.22 శాతానికి. నికర ఎన్‌పీఏలు 4.69 శాతం నుంచి 3.31 శాతానికి తగ్గినట్లు బ్యాంక్‌ తెలిపింది. కాగా జూన్‌ త్రైమాసికంలో కొత్తగా రూ.3,600 కోట్ల మొండి బకాయిలు వచ్చి చేరాయని బ్యాంక్‌ పేర్కొంది. ఇందులో రూ.2,600 కోట్లు కార్పొరేట్‌ రంగానికి చెందినవి కాగా రూ.900 కోట్లు ఎంఎ్‌సఎంఈ, రూ.600 కోట్లు రిటైల్‌ రంగానికి చెందినవని యూబీఐ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త మొండి బకాయిలు రూ.13,000 కోట్ల వరకు ఉండొచ్చని బ్యాంక్‌ భావిస్తోంది. కాగా జూన్‌ త్రైమాసికంలో రూ.4,200 కోట్ల మొత్తాన్ని రికవరీ చేసినట్లు తెలిపింది. మరోవైపు ఈ కాలంలో మొండి బకాయిల కోసం చేసిన కేటాయింపులు రూ. 4,122 కోట్ల నుంచి రూ.3,889 కోట్లకు తగ్గినట్లు యూబీఐ తెలిపింది. కాగా సమీక్షా కాలంలో బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ.19,913.64 కోట్ల నుంచి రూ.20,991.09 కోట్లకు పెరిగింది. 

Updated Date - 2022-07-27T06:58:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising