ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిజిటల్ కంపెనీలకు UAE ప్రోత్సాహం

ABN, First Publish Date - 2022-07-07T00:52:39+05:30

డిజిటల్ కంపెనీల ప్రవేశాన్ని మరింత వేగవంతం చేసే క్రమంలో... UAE తారస్థాయిలో యత్నిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్ : డిజిటల్ కంపెనీల ప్రవేశాన్ని మరింత వేగవంతం చేసే క్రమంలో... UAE తారస్థాయిలో యత్నిస్తోంది. ఈ క్రమంలోనే... 'నెక్స్ట్‌జెన్ ఎఫ్‌డిఐ'ను  ప్రారంభించింది. నెక్ట్స్‌జెన్ ఎఫ్‌డీఐ కింద తమ సిబ్బందిని యుఏఈకి  తరలించాలని యోచిస్తున్న కంపెనీలకు ఈ కార్యక్రమం కింద  ప్రత్యేక ప్రోత్సాహకాలనందించనున్నారు. యుఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ 6-12 నెలల్లో 300 కంటే ఎక్కువ డిజిటల్-కేంద్రీకృత వ్యాపారాలను ఏర్పాటు చేసే క్రమంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించింది.


ఆయా కంపెనీలకు యుఏఈ  నుండి ప్రారంభించి, స్కేల్ చేయడానికి అవసరమైన మార్కెట్ ఎంట్రీ రూేపంలో మద్దతునందివ్వనుంది. రానున్న నెలల్లో అదనపు ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావాలని కూడా యోచిస్తోంది. ఇక... బల్క్ వీసా జారీ, వేగవంతమైన బ్యాంకింగ్ సేవలు సహా సిబ్బందిని UAEకి తరలించే కంపెనీలకు వాణిజ్య/నివాస(రియల్ ఎస్టేట్)  ప్రోత్సాహకాలను అందించడం ద్వారా సహకరించనుంది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, డేటా సైంటిస్ట్‌లు, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, డిజిటల్ అసెట్ ఎంటర్‌ప్రెన్యూర్‌లలో నైపుణ్యం కలిగిన కొత్త-తరం కంపెనీలపై ప్రోగ్రామ్ దృష్టి సారిస్తుంది.  కాగా... ADGM, DIFC, దుబాయ్ ఇంటర్నెట్ సిటీ, దుబాయ్ సౌత్, DMCC, EmiratesNBD, Wio సంస్థలతో NextGenFDI భాగస్వామ్యాన్ని కలిగి ఉంది.

Updated Date - 2022-07-07T00:52:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising