ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Two Wheeler Companiesకు డిమాండ్ పెరిగింది.. షేర్లు 52 వారాల గరిష్టానికి ఎగిశాయ్..

ABN, First Publish Date - 2022-07-19T17:39:38+05:30

Two Wheeler Companies : గ్రామీణ ప్రాంతాల్లో పంటలు విరివిగా పండటం.. అనుకున్న ధరలు రావడంతో పాటు స్కూళ్లు, కళాశాలలు ప్రారంభం కావడం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Two Wheeler Companies : గ్రామీణ ప్రాంతాల్లో పంటలు విరివిగా పండటం.. అనుకున్న ధరలు రావడంతో పాటు స్కూళ్లు, కళాశాలలు ప్రారంభం కావడం.. వాహన కంపెనీలకు మంచి బూస్ట్ ఇచ్చాయి. దీంతో టు వీలర్ కంపెనీలు టీవీఎస్ మోటార్స్(TVS Motors) కంపెనీ, ఐషర్ మోటార్స్(Eicher Motors) షేర్లు మంగళవారం ఇంట్రా డేలో బీఎస్‌ఈ(BSE)లో తమ 52 వారాల గరిష్టంపై ఫోకస్ చేశాయి.


వ్యక్తిగత స్టాక్స్ విషయానికి వస్తే.. టీవీఎస్ మోటార్స్ షేర్లు 1 శాతం పెరిగి జూలై 1, 2002న టచ్ చేసిన రూ.885.85ను అధిగమించి రూ.888.80 వద్ద రికార్డ్ హైకి చేరుకున్నాయి. ఇక ఐషర్ మోటార్స్ నేటి ఇంట్రాడే ట్రేడ్‌లో 2 శాతం పెరిగి 52 వారాల గరిష్టం రూ.3,088కి చేరాయి. గడిచిన నెల రోజులలో ఈ స్టాక్స్ ఒక్కొక్కటి 20 శాతం ర్యాలీ చేశాయి. ఎస్అండ్‌పీ బీఎస్ఈ సెన్సెక్స్‌లో 6 శాతం పెరిగాయి.


దేశీయ మోపెడ్(Moped), ఎకానమీ మోటార్‌ సైకిల్(Motor Cycle) సెగ్మెంట్లు ఇటీవల తక్కువ పనితీరును కనబరిచినప్పటికీ తిరిగి ఫామ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. కాగా.. భారతదేశం అంతటా పట్టణ మార్కెట్లలో గణనీయమైన అభివృద్ధితో, స్కూటర్ సెగ్మెంట్ పనితీరుపై కంపెనీ సానుకూలంగా ఉందని టీవీఎస్ మోటార్ తెలిపింది. వ్యక్తిగత, స్థిరమైన మొబిలిటీ సొల్యూషన్స్ కోసం డిమాండ్ అనేది ప్రపంచ ద్విచక్ర వాహన మార్కెట్‌కు బూస్ట్ ఇస్తోంది. కమోడిటీ ధరలను తగ్గించడం, సెమీకండక్టర్ లభ్యతను సాధారణీకరించడం వంటి అంశాలు డిమాండ్‌ను తీర్చడంలో సహాయపడతాయి. 


Updated Date - 2022-07-19T17:39:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising