ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bajaj Chetak Electric Scooter: హైదరాబాద్‌లో అందుబాటులోకి చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ వర్క్‌షాప్స్

ABN, First Publish Date - 2022-09-06T01:42:01+05:30

చేతక్‌ ప్రీమియం ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఎక్స్‌క్లూజివ్‌ డీలర్‌ అయిన సిద్ధి వినాయక ఆటోమొబైల్స్‌ నగరంలో రెండు నూతన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్:  చేతక్‌ ప్రీమియం ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఎక్స్‌క్లూజివ్‌ డీలర్‌ అయిన సిద్ధి వినాయక ఆటోమొబైల్స్‌ నగరంలో రెండు నూతన చేతక్‌ వర్క్‌షాప్‌లను ప్రారంభించింది. ఒకదానిని బేగంపేటలో ఏర్పాటు చేయగా, రెండో దానిని కాచిగూడలో ప్రారంభించింది. సిద్ధి వినాయక ఆటోమొబైల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బాబుల్‌ రెడ్డి, వృద్ధిజీత్‌ బందోపాధ్యాయ్‌ (చేతక్‌  నేషనల్‌  సేల్స్‌ హెడ్‌), శివకుమార్‌ (చేతక్‌ నేషనల్‌ సేల్స్‌ హెడ్‌) కలిసి వీటిని ప్రారంభించారు.


ఈ సందర్భంగా బాబుల్ రెడ్డి మాట్లాడుతూ.. చేతక్‌ ప్రీమియం ఎలక్ట్రిక్‌ వాహనాల సర్వీస్‌ షెడ్యూల్‌ సంవత్సరానికి ఓసారే అయినా వినియోగదారులకు అత్యుత్తమ శ్రేణి సేవా సదుపాయం అందించాల్సిన ఆవశ్యకత తమపై ఉందని భావిస్తున్నట్టు చెప్పారు. ఎలాంటి ఆయిల్‌ మార్క్స్‌, డస్ట్‌, స్మోక్‌ లేదంటే శబ్దాలు చేతక్‌ వర్క్‌షాప్‌ల వద్ద ఉండవని అన్నారు.  మరో మూడు నెలల్లో కూకట్‌పల్లి వద్ద మరో  వర్క్‌షాప్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. వర్క్‌షాప్స్ అందుబాటులోకి రావడంపై వినియోగదారులు సంతోషం వ్యక్తం చేశారు. తమ అవసరాలు పూర్తిగా తీరతాయనే సంపూర్ణ విశ్వాసం కలిగిందన్నారు. 


బజాజ్‌ చేతక్‌ ప్రీమియం ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను పూర్తి లోహపు బాడీతో  తీర్చిదిద్దారు. ఇది కంపాక్ట్‌ చార్జర్‌ను కలిగి ఉంటుంది. ఎక్కడైనా సరే దీనిని చార్జ్‌ చేసుకోవచ్చు. వీటితో పాటుగా అత్యున్నత శ్రేణి ప్రీమియం ఫీచర్లను సైతం ఇది కలిగి ఉండటం వల్ల  వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేయడానికి  ఆసక్తి చూపుతున్నారు. ఆటోమొబైల్స్‌ తయారీలో 75 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన బజాజ్‌ ఆటో లిమిటెడ్‌ నుంచి ఇవి రావడం వినియోగదారుల్లో మరింత నమ్మకాన్ని పెంచింది.  


Updated Date - 2022-09-06T01:42:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising