ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TVS Motor : ఆర్థిక ఫలితాలిచ్చిన బూస్ట్‌తో దూసుకెళ్లిన టీవీఎస్ మోటర్.. ఆల్ టైమ్ హైకి స్టాక్

ABN, First Publish Date - 2022-07-29T18:15:36+05:30

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో టీవీఎస్ మోటార్ లాభాల(TVS Motor Profits) పంట పండించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

TVS Motor :  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో టీవీఎస్ మోటార్ లాభాల(TVS Motor Profits) పంట పండించింది. కంపెనీ షేర్లకు ఇంత బూస్ట్ ఇచ్చిన తర్వాత ఊరుకుంటాయా? రయ్‌మంటూ దూసుకెళ్లాయి. శుక్రవారం ఇంట్రా-డే(Intra-Day)లో కంపెనీ షేర్లు 10 శాతం పెరిగాయి. దీంతో టీవీఎస్ మోటార్ కంపెనీ షేర్లు(TVS Motor company shares) ఆల్ టైమ్ హై రూ. 953.05కి చేరాయి. 2021 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ.10.55 కోట్ల నష్టం నుంచి బయటపడటమే కాకుండా అదిరిపోయే లాభాలను ఆర్జించింది.


అమ్మకాల పరిమాణంలో పెరుగుదల కారణంగా 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆటో మేజర్ టీవీఎస్ మోటార్ రూ. 305.37 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని నమోదు చేసిన తర్వాత ఈ స్పైక్ వచ్చింది. కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 4,689 కోట్ల నుంచి 57 శాతం వృద్ధి చెంది, రూ.7,316 కోట్లకు చేరుకుంది. కొవిడ్ లాక్‌డౌన్(Covid Lockdown) కారణంగా మొదటి త్రైమాసిక ఫలితాలను గత సంవత్సరం మొదటి త్రైమాసికంతో కచ్చితంగా పోల్చలేమని టీవీఎస్ మోటార్ వెల్లడించింది.


అనుకూలమైన రబీ అవుట్‌పుట్‌తో పాటు పంటల ధరల పెరుగుదల కారణంగా గ్రామీణ ప్రాంతంలోనూ అమ్మకాలు పెరిగాయి. అలాగే వ్యాక్సినేషన్ కవరేజీ పెరగడం, పరిమితుల సౌలభ్యం, కాంటాక్ట్-ఇంటెన్సివ్ సేవల పెరుగుదల కారణంగా పట్టణాల్లో సైతం డిమాండ్ పెరిగిందని కంపెనీ తెలిపింది. మొత్తంగ అమ్మకాల పరిమాణంలో పెరుగుదల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో టీవీఎస్ మోటార్ ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్టగలిగింది.


Updated Date - 2022-07-29T18:15:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising