ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Torrent Gas: పీఎన్‌జీ, సీఎన్‌జీ రేట్లను తగ్గించిన టోరెంట్ గ్యాస్

ABN, First Publish Date - 2022-08-20T00:58:05+05:30

గృహ వినియోగ పైప్‌డ్ నేచురల్ గ్యాస్ (PNG), వాహనాలకు వాడే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలను ఐదు రూపాయల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: గృహ వినియోగ పైప్‌డ్ నేచురల్ గ్యాస్ (PNG), వాహనాలకు వాడే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలను ఐదు రూపాయల చొప్పున తగ్గిస్తూ టొరెంట్ గ్యాస్ నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థ సేవలు అందిస్తున్న అన్ని ప్రాంతాల్లోనూ నిన్నటి నుంచే ఇది అమల్లోకి వచ్చింది. తగ్గింపు నేపథ్యంలో స్టాండర్డ్ క్యూబిక్ మీటర్‌ (SCM) పీఎన్‌జీ ధర రూ. 47 కు తగ్గింది. అలాగే, పీఎన్‌జీ ధర కిలోకు రూ. 87కు తగ్గింది.


దేశీయ పీఎన్‌జీ, సీఎన్‌జీలకు సహజవాయువు కేటాయింపులను 85 శాతం నుంచి 95 శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతోనే ధరలను తగ్గించినట్టు టొరెంట్ తెలిపింది. ధరల తగ్గింపుతో వినియోగదారులకు ఉపశమనం లభించినట్టు అయింది. తాజా తగ్గింపు నేపథ్యంలో సంగారెడ్డిలో డొమెస్టిక్ పీఎన్‌జీ ధర SCMకి రూ. 45(పన్నులతో కలిపి) ఉండగా,  LPG ధర 31 శాతం తగ్గింది. అలాగే, సవరించిన సీఎన్‌జీ ధర రూ. కిలోకు 90 (పన్నులతో సహా)గా ఉంది. 

Updated Date - 2022-08-20T00:58:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising