ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈసారి వృద్ధి 7 శాతమే..

ABN, First Publish Date - 2022-11-29T03:07:42+05:30

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23) గాను భారత జీడీపీ వృద్ధి అంచనాను 7 శాతానికి తగ్గిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ఎస్‌ అండ్‌ పీ తెలిపింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23) గాను భారత జీడీపీ వృద్ధి అంచనాను 7 శాతానికి తగ్గిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ఎస్‌ అండ్‌ పీ తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2023-24) వృద్ధి అంచనాను 6 శాతానికి కుదించింది. అయితే, దేశీయ గిరాకీపైనే ప్రధానంగా ఆధారపడిన ఇండియన్‌ ఎకానమీపై ప్రపంచ మందగమన ప్రభావం తక్కువేనని తాజా నోట్‌లో పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబరులో ఎస్‌ అండ్‌ పీ భారత వృద్ధి రేటును 2022-23కి 7.3 శాతంగా, 2023-24కి 6.5 శాతంగా అంచనా వేసింది. గత ఏడాదిలో భారత వృద్ధి రేటు 8.5 శాతంగా నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రిటైల్‌ ధరల సూచీ సగటు 6.8 శాతంగా నమోదు కావచ్చని, ఆర్‌బీఐ రెపో రేట్లు 2023 మార్చి నాటికి 6.25 శాతానికి చేరుకోవచ్చని ఎస్‌ అండ్‌ పీ అంచనా వేసింది. ఆందోళనకర స్థాయికి పెరిగిన ధరలకు కళ్లెం వేసేందుకు ఆర్‌బీఐ ఇప్పటికే రెపో రేటును 1.9 శాతం పెంచింది. దాంతో రెపో రేటు 5.9 శాతానికి చేరుకుంది.

ఇక డాలర్‌-రూపాయి మారకం రేటు విషయానికొస్తే, ప్రస్తుతం రూ.81.77 స్థాయిలో ట్రేడవుతున్న ఎక్స్ఛేంజ్‌ రేటు వచ్చే మార్చి చివరినాటికి రూ.79.50కి తగ్గవచ్చని రేటింగ్‌ ఏజెన్సీ అంచనా. ప్రపంచ ఆర్థిక మందగమనం, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, అధిక ధరలు, పెరుగుతున్న వడ్డీ రేట్ల నేపథ్యంలో ఇప్పటికే పలు సంస్థలు భారత వృద్ధి అంచనాలకు కోతపెట్టాయి.

ఎస్‌ అండ్‌ పీ

అంచనాల్లో కోత

Updated Date - 2022-11-29T03:07:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising