ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rakesh Jhunjhunwalaకి చెందిన ఈ ప్రైవేట్ సెక్టార్ స్టాక్.. ఒక్క నెలలో 29% పరుగులు తీసింది..

ABN, First Publish Date - 2022-07-20T16:39:36+05:30

బిగ్‌బుల్(Bigbull), ఏస్ ఇన్వెస్టర్(Ace Investor) రాకేష్ ఝున్‌ఝున్‌వాలా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవల్సిన అవసరం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Rakesh Jhunjhunwala Stock : బిగ్‌బుల్(Bigbull), ఏస్ ఇన్వెస్టర్(Ace Investor) రాకేష్ ఝున్‌ఝున్‌వాలా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవల్సిన అవసరం లేదు. నష్టాల్లో ఉన్న కంపెనీనైనా తన ఎంట్రీతో లాభాల బాట పట్టించగల దిట్ట. అందుకే మార్కెట్ పరిశీలకులంతా ఆయనపై ఓ కన్నేసి ఉంచుతారు. ఆయన ప్రతి స్టెప్‌ను పరిశీలిస్తుంటారు. అసలు విషయం ఏంటంటే.. బిగ్‌బుల్‌ పోర్ట్‌ఫోలియో(Portfolio)కి చెందిన ఓ స్టాక్ కేవలం ఒక నెలలోనే 29 శాతం ర్యాలీ చేసింది. 


బుధవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఫెడరల్ బ్యాంక్(Federal Bank) షేర్లు బీఎస్ఈ(BSE)లో 2 శాతం పెరిగి రూ.109.40 వద్ద మూడేళ్ల గరిష్టాన్ని తాకాయి. జూన్ త్రైమాసికంలో బలమైన వ్యాపార వృద్ధి కారణంగా బ్యాంక్ అదిరిపోయే కార్యాచరణ పనితీరును వెల్లడించింది. దీంతో గత నాలుగు ట్రేడింగ్ సెషన్‌లలో స్టాక్ 12 శాతం లాభపడింది. గత నెలలో ఈ స్టాక్ 29 శాతం ర్యాలీ చేసింది. ఎస్‌అండ్‌పీ బీఎస్ఈ సెన్సెక్స్‌లో 7.4 శాతం పెరిగింది. ఈ స్టాక్ జూలై 2019 నుంచి కూడా అదిరిపోయే జోష్‌తో ట్రేడవుతోంది. ఇక అక్టోబర్ 17, 2017న అయితే రికార్డు స్థాయిలో రూ.128కి చేరుకుంది.


ఇక బిగ్‌బుల్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా (2.64 శాతం), ఆయన భార్య రేఖా జున్‌జున్‌వాలా(Rekha Jhunjhunwala) (1.01 శాతం) సమిష్టిగా మార్చి 2022 త్రైమాసికం చివరి నాటికి ఫెడరల్ బ్యాంక్‌లో 3.65 శాతం వాటాను కలిగి ఉన్నారని షేర్‌హోల్డింగ్ ప్యాటర్న్ డేటా చూపిస్తోంది. బ్యాంక్ ఇంకా జూన్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ డేటాను ఫైల్ చేయలేదు. 2023 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఫెడరల్ బ్యాంకు గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో గడించిన రూ.367 కోట్ల నుంచి వార్షికంగా 64 శాతం పెరిగి అత్యధికంగా రూ. 601 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఫెడరల్ బ్యాంకు నికర వడ్డీ ఆదాయం ఏడాది క్రితం త్రైమాసికంలో రూ.1,418 కోట్ల నుంచి 13 శాతం వృద్ధితో రూ.1,605 కోట్లకు పెరిగింది. 


Updated Date - 2022-07-20T16:39:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising