ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కశ్మీర్‌లో snowfallతో 37 విమాన సర్వీసుల రద్దు

ABN, First Publish Date - 2022-01-06T12:35:49+05:30

జమ్మూకశ్మీర్ అంతటా మంచు విస్తారంగా కురుస్తుండటంతో 37 విమాన సర్వీసులు రద్దు చేశామని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ అంతటా మంచు విస్తారంగా కురుస్తుండటంతో 37 విమాన సర్వీసులు రద్దు చేశామని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు చెప్పారు. మంచు కురుస్తుండటం వల్ల విమానానికి దారి కనిపించక పోవడంతో శ్రీనగర్ నుంచి పలు నగరాలకు రాకపోకలు సాగించే విమానాలను రద్దు చేశామని అధికారులు పేర్కొన్నారు. శ్రీనగర్ నుంచి 42 విమానాలు షెడ్యూల్ చేయగా వీటిలో 37 విమాన సర్వీసులను రద్దు చేశామని విమానాశ్రయ అధికారులు వివరించారు.విమానాల రద్దు కారణంగా వందలాది మంది ప్రయాణికులు శ్రీనగర్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. 


‘‘ఈరోజు తేలికపాటి హిమపాతం వల్ల విమానయానానికి దారి కనిపించక పోవడంతో విమానాల రాకపోకలకు ఆటంకం కలిగింది, 42 షెడ్యూల్డ్ విమానాల్లో కేవలం ఐదు మాత్రమే నడిపాం...37 విమాన సర్వీసులను రద్దు చేశాం’’ అని విమానాశ్రయ అధికార అధికారి తెలిపారు.కశ్మీర్ లోయలోని చాలా ప్రదేశాలలో క్రిస్మస్ సందర్భంగా మంచు కురుస్తున్న నేపథ్యంలో కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చారు.విమాన సర్వీసుల రద్దుతో పర్యాటకులు శ్రీనగర్‌లోనే ఉండాల్సి రావడంతో అవస్థలు పడుతున్నారు.


Updated Date - 2022-01-06T12:35:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising