ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

6G: 5జీ వచ్చేసింది.. 6జీపై కీలక ప్రకటన చేసిన టెలికం మంత్రి

ABN, First Publish Date - 2022-10-03T21:46:59+05:30

Bharat Telecom has now shifted from 4G to 5G. Airtel has already launched 5G services.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత టెలికం ఇప్పుడు 4జీ నుంచి 5జీకి షిఫ్టయింది. ఎయిర్‌టెల్ ఇప్పటికే 5జీ (5G) సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం కొన్ని నగరాలకే పరిమితమైన ఈ సేవలను 2024 నాటికి దేశవ్యాప్తంగా అందించాలని నిర్ణయించింది. 5జీ సేవల్లోనూ(5G Services) అధిపత్యం చెలాయించాలని చూస్తున్న రిలయన్స్ జియో (Reliance Jio) దీపావళి నాటికి 5జీ ప్లాన్ల (5G Plans)ను విడుదల చేయనుంది. 5జీ సేవలను (5G Services) అందుకోవాలంటే వినియోగదారులు తప్పకుండా 4జీ నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్లకు మైగ్రేట్ కావాల్సి ఉంటుంది. 5జీ సేవలను (5G Services) ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించి రెండు రోజులు కూడా కాకముందే కేంద్ర టెలికం మంత్రి అశ్వినీ వైష్ణవ్ 6జీ సేవల(6G Services)పై కీలక ప్రకటన చేశారు. 6జీ (6G) సేవల్లోనూ ఇండియా ముందుంటుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ (ITU) ఆధ్వర్యంలో 6జీ, 5జీ మొబైల్ సిస్టమ్ అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన అధ్యయన బృందాలకు ఇప్పుడు భారత ప్రతినిధుల అధ్యక్షత వహిస్తున్నట్టు చెప్పారు.  


3జీ నుంచి 4జీకి, 4జీ నుంచి 5జీకి మారినట్టు టెలికం టెక్నాలజీ ఇకపై 5జీ నుంచి 6జీకి మారుతుంది. నిజానికి 4జీ నుంచి 5జీకి మారడాన్ని టెక్నలజీలో అతిపెద్దగా మార్పుగా చెప్పుకోవచ్చు. దీనిని అప్‌గ్రేడ్‌గా చెప్పడం తప్పే అవుతుంది. 6జీ ప్రమాణం అభివృద్ధి, దాని చుట్టూ ముందుగానే అధ్యయనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆ పని భారతదేశంలోనే ముందుగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని టెలికం మంత్రి వైష్ణవ్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే నిజానికి 5జీ (5G) విషయంలో భారత్ వెనకబడినప్పటికీ, అత్యంత వేగవంతమైన 5జీ నెట్‌వర్క్‌గా మాత్రం అవతరించే అవకాశం ఉంది. 5జీతో పోలిస్తే 6జీ(6G) అనేక రెట్లు వేగవంతమైనదిగా ఉంటుందని చెబుతున్నారు.  

Updated Date - 2022-10-03T21:46:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising