ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళనాడులో సోలార్ సెల్, మాడ్యూల్ తయారీ

ABN, First Publish Date - 2022-07-07T00:15:05+05:30

తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో solar cells and modules తయారీ యూనిట్ ఏర్పాటుకుగాను రూ. 3 వేల కోట్ల పెట్టుబడి పెట్టే క్రమంలో... తమిళనాడు ప్రభుత్వంతో టాటా పవర్ ఒప్పందం కుదుర్చుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

* టాటా పవర్ రూ. 3 వేల కోట్ల పెట్టుబడి

చెన్నై : తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో solar cells and modules తయారీ యూనిట్ ఏర్పాటుకుగాను  రూ. 3 వేల కోట్ల పెట్టుబడి పెట్టే క్రమంలో... తమిళనాడు ప్రభుత్వంతో టాటా పవర్ ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లోని అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పవర్ కంపెనీలలో ఒకటైన టాటా పవర్... తిరునల్వేలి జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ 4GW సోలార్ సెల్, 4GW సోలార్ మాడ్యూల్ తయారీ కర్మాగారాన్ని నెలకొల్పేందుకు సుమారుగా రూ. 3 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు తమిళనాడు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం(MoU)పై Tata Power సంతకం చేసింది. ప్లాంట్‌లో పెట్టుబడి 16 నెలల వ్యవధిలో జరగనున్నట్లు, ప్రత్యక్షంగా, లేదా... పరోక్షంగా రెండు వేల  మందికి పైగా ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని టాటా పవర్ వర్గాలు వెల్లడించాయి.


ఉపాధి పొందనున్న వారిలో మహిళలే అధిక సంఖ్యలో ఉంటారని తెలిపింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, సీనియర్ అధికారుల సమక్షంలో తమిళనాడు ప్రభుత్వ అదనపు ప్రధానకార్యదర్శి ఎస్ కృష్ణన్, పరిశ్రమల శాఖ, టాటా పవర్ సీఈఓ & ఎండీ ప్రవీర్ సిన్హా ఈ ఎంఓయూపై సంతకాలు చేశారు. టాటా పవర్ CEO & MD ప్రవీర్ సిన్హా ‘భారతదేశం తన ఇంధన అవసరాలను తీర్చడానికి స్వచ్ఛమైన, గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ వినియోగానికి కి నాయకత్వం వహించే అవకాశముంది’ అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.  

Updated Date - 2022-07-07T00:15:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising