ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అత్యంత సులభంగా ఈ-ఇన్వాయిస్.. ఎంఎస్ఎంఈలకు ట్యాలీ సొల్యూషన్స్ మద్దతు

ABN, First Publish Date - 2022-10-08T02:31:47+05:30

ఈ-ఇన్వాయిసింగ్ చేయాలనే నిబంధన గడువు సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి సంస్థలకు సాయం చేసేందుకు ట్యాలీ సొల్యూషన్స్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: పది కోట్ల రూపాయలు ఆ పైన టర్నోవర్ కలిగిన వ్యాపారాలకు జీఎస్టీ నమోదు తప్పనిసరి. ఇలాంటి సంస్థలు ఈ-ఇన్వాయిసింగ్ చేయాలనే నిబంధన గడువు సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి సంస్థలకు  సాయం చేసేందుకు ట్యాలీ సొల్యూషన్స్ ముందుకొచ్చింది. సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ ఈ-ఇన్వాయిసింగ్‌ను సులభంగా నిర్వహించడంలో సాయం చేస్తోంది. ముఖ్యంగా వరంగల్‌లోని వ్యాపార సంస్థలకు మద్దతు అందించేందుకు సిద్ధంగా ఉంది.  ఈ-ఇన్వాయిసింగ్ ప్రభావాలు, ఈ-వే బిల్, ఆడిట్ ట్రయల్, వ్యాపార ఉత్పాదకతను మెరుగుపరుచుకుంటూనే అతి సులభంగా ఈ-ఇన్వాయిసింగ్‌లో మారడమెలానో చెబుతోంది. స్థానిక వ్యాపార సంఘాలతో కలిసి ఈ సంస్థ పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలాగే, ఎక్స్‌పోలు నిర్వహిస్తూ అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది.


అలాగే,  పలు కంటెంట్‌ క్రియేటర్లుతో సైతం కలిసి పనిచేస్తూ వెబినార్లను సబ్జెక్ట్‌ మ్యాటర్‌ నిపుణులతో కలిసి నిర్వహిస్తూ గరిష్టంగా వ్యాపార యజమానులను చేరుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ కంపెనీ తమ ఉద్యోగులకు సైతం శిక్షణ అందించడంతో పాటుగా 28వేలకు పైగా భాగస్వాములకు  సైతం శిక్షణ ఇస్తోంది. వాట్సాప్‌ మద్దతుతో  కస్టమర్‌ సపోర్ట్‌ టీమ్‌, ట్యాలీ కేర్‌ సహా  అన్ని టచ్‌ పాయింట్లలోనూ సరైన సమాచారం మాత్రమే పంచుకుంటారనే భరోసా అందిస్తుంది.


ఈ కార్యక్రమంపై ట్యాలీ సొల్యూషన్స్‌ జనరల్‌ మేనేజర్‌(సౌత్‌ జోన్‌) భువన్‌ రంజన్‌ మాట్లాడుతూ.. వ్యాపారాలను డిజిటలీకరించాలనే ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రూ.10 కోట్లు ఆపైన టర్నోవర్ కలిగిన వ్యాపారాలన్నీ ఈ నెల 1 నుంచి ఈ–ఇన్వాయిసింగ్‌ను అమలు చేయాలని అన్నారు. ఐదవ దశ ఈ–ఇన్వాయిసింగ్‌ అమలుతో దాదాపు 4.8 లక్షల వ్యాపార సంస్ధలు ఈ–ఇన్వాయిసింగ్‌ పరిధిలోకి వస్తాయన్నారు. వీటిలో దాదాపు 2.3 లక్షల వ్యాపార సంస్ధలు అక్టోబర్‌ 01 నుంచి నిబంధనలకు కట్టుబడి ప్రారంభించాలని అన్నారు. వరంగల్‌ తమకు అత్యంత కీలకమైన మార్కెట్‌లలో ఒకటని అన్నారు. ఇక్కడ వేలాది వ్యాపార సంస్ధలు, పరిశ్రమలు నిబంధనలకు కట్టుబడి ఉండేలా అవగాహన కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు.  

Updated Date - 2022-10-08T02:31:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising