ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘స్వర్ణ పానం’.. ఈ టీ పొడి బంగారమే..

ABN, First Publish Date - 2022-05-22T07:00:21+05:30

ఆ టీ పొడి ధర అక్షరాలా కిలో రూ.2.5 లక్షలు. అవును మీరు చదివింది నిజమే. దాని పేరు ‘స్వర్ణ పానం’.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కిలో రూ.2.5 లక్షలు

గువహతి: ఆ టీ పొడి ధర అక్షరాలా కిలో రూ.2.5 లక్షలు. అవును మీరు చదివింది నిజమే. దాని పేరు ‘స్వర్ణ పానం’. అసోమ్‌కు చెందిన రంజిత్‌ బారువా అనే ఒక టీ పొడి దుకాణం యజమాని ఈ సరికొత్త టీ పొడిని తయారు చేశాడు. అసోం టీ తోటల్లో లభించే లేలేత తేయాకులకు పరిమిత మోతాదులో మేలిమి (24 క్యారట్స్‌) బంగారం, తేనె, బెల్లం, కోకో జోడించి ఆయన ఈ ‘స్వర్ణ పానం’ టీ పొడిని మార్కెట్‌ చేస్తున్నాడు. శనివారం గువహతిలో జరిగిన ఇంటర్నేషనల్‌ టీ ఫెస్టివల్‌లోనూ ఆయన ఈ టీ పొడితో చేసిన టీని కొద్ది మందికి సర్వ్‌ చేశాడు. మంచి సువాసన, రుచితో కూడిన ఈ టీకి చాలా మంది ఫిదా అయిపోయారు. వంద గ్రాముల ప్యాక్‌ లో లభించే ఈ టీ  పొడి ప్యాక్‌ కావాలంటే కొనుగోలుదారులు రూ.25,000 ఖర్చు చేయాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన అసోమ్‌ టీకి మరింత విలువ జోడించాలనే ఆలోచనతోనే తాను ఈ ప్రయోగం చేసినట్టు బారువా చెప్పారు. గతంలోనూ ఆయన అనేక ప్రత్యేక టీ పొడులను అభివృద్ధి చేశాడు. యూరోపియన్‌ దేశాల్లో ఈ లగ్జరీ టీలకు మంచి మార్కెట్‌ ఉంది. ఇప్పుడు స్వర్ణ పానం టీతో బారువా ఖ్యాతి మరింత ఇనుమడించింది.

Updated Date - 2022-05-22T07:00:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising