ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూలై 1 నుంచి... పెరగనున్న స్టీల్ ధరలు ?!

ABN, First Publish Date - 2022-06-30T22:59:47+05:30

బ్యాక్-టు-బ్యాక్ డౌన్‌వర్డ్ కరెక్షన్‌ల నేపథ్యంలో... అధిక ఇన్‌పుట్ ఖర్చుల కారణంగా స్టీల్ ధరలు జూలై నుండి పెరుగుతాయని పరిశ్రమ ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : బ్యాక్-టు-బ్యాక్ డౌన్‌వర్డ్ కరెక్షన్‌ల నేపథ్యంలో... అధిక ఇన్‌పుట్ ఖర్చుల కారణంగా స్టీల్ ధరలు జూలై నుండి పెరుగుతాయని పరిశ్రమ ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. బొగ్గు ధర టన్ను రూ. 17 వేలు ఉండగా, ఒడిశా మినరల్ కార్పొరేషన్ ఇనుప ఖనిజం ధరలు మరింత ఎక్కువగానే ఉన్నాయి. ఇది ఒడిశాలో ఇనుప ఖనిజం ప్రధాన సరఫరాదారుగా ఉందని JSPL మేనేజింగ్ డైరెక్టర్ V R శర్మ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో చెప్పారు.


‘ధరలు ఇప్పటికే దిగువకు పడిపోయాయి. మరింత తగ్గించే అవకాశం లేదు. ప్రధానంగా అధిక ఇన్‌పుట్ ఖర్చుల కారణంగా(ప్రైమరీ ప్లేయర్‌లు) శుక్రవారం, జూలై 1 నుండి పైకి ధరల సవరణ ఉంటుంది’ అని వెల్లడించారు. సెకండరీ స్టీల్ తయారీదారులు ఇప్పటికే గత నాలుగు రోజుల్లో టన్నుకు రూ. 2 వేలు-రూ. 55 వేల వరకు రీబార్స్ ధరను పెంచారని శర్మ చెప్పారు. ఉక్కు తయారీదారులపై పలు ఇతర అంశాలు ఒత్తిడిని పెంచుతున్నాయని చెబుతున్నారు. మరోవైపు... బొగ్గు లభ్యతతో సమస్యలు ఉన్నాయని శర్మ చెప్పారు. చాలావరకు బొగ్గును విద్యుత్తు రంగానికి మళ్లించడంతో బొగ్గు సరఫరాకు రేక్స్ కూడా అందుబాటులో లేవు. స్టీల్‌మింట్ ప్రకారం... హాట్ రోల్డ్ కాయిల్(HRC) ధరలు టన్నుకు రూ. 59 వేలు-రూ. 60 వేల శ్రేణి నుండి రూ. 76 వేల స్థాయికి చేరుకున్నాయి.

Updated Date - 2022-06-30T22:59:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising